పాప బాగా బిజీ!

రెండు నెలల క్రితం వరకు ఐరెన్‌లెగ్‌ అయిపోయిందని అన్నవాళ్లే ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ డేట్స్‌ కోసం మళ్లీ ఎగబడుతున్నారు. 2016లో వరుస ఫ్లాపులు చవిచూసిన కాజల్‌ ఇక బౌన్స్‌బ్యాక్‌ అవడం కష్టమని అనుకున్నారు. కానీ ఆమె తెలివిగా చిరంజీవితో చిత్రాన్ని ఓకే చేసింది. తనకంటే వయసులో చాలా పెద్ద వాడైన చిరంజీవితో నటించడానికి కాజల్‌ సిద్ధపడిపోయింది.

ఆ నిర్ణయం ఆమెని మళ్లీ తిరిగి క్రేజీ హీరోయిన్‌ని చేసింది. అయితే ఖైదీ నంబర్‌ 150 రిలీజ్‌ అయ్యేసరికే  కాజల్‌ నాలుగు సినిమాలు ఒప్పేసుకుంది. అందులో ఒకటి తేజ, రాణాతో చేస్తున్నది కాగా, మరో మూడు తమిళ చిత్రాలు. దీంతో కాజల్‌ ఇప్పుడు చాలా బిజీగా వుంది. కొత్తగా ఎవరికీ డేట్స్‌ ఇవ్వలేకపోతోంది.

ఇటీవల ఓ భారీ చిత్రం కోసం కాజల్‌కి కోటిన్నర ఆఫర్‌ చేసినా కానీ రిజెక్ట్‌ చేసిందట. డబ్బు బాగా వస్తుందని ఈ ఆఫర్‌ ఓకే చేసినట్టయితే, మిగతా సినిమాల షెడ్యూల్స్‌ దెబ్బతింటాయని, తనకి కూడా రెస్ట్‌ వుండదని వదిలేసుకుందట. సమంత కూడా కళ కోల్పోయినప్పటికీ కాజల్‌ ఇప్పటికీ ఫుల్‌ డిమాండ్‌లో వుండడం గొప్ప విషయమే. సౌందర్య తర్వాత ఇంతకాలం టాప్‌లో కొనసాగిన హీరోయిన్‌ కాజలేనేమో.