పవన్‌కళ్యాణ్‌ 30 కోట్లు పట్టుకుపోయాడు

‘కాటమరాయుడు’కి పవన్‌కళ్యాణ్‌ అనధికార నిర్మాత అనేది తెలిసిందే. శరత్‌ మరార్‌తో కలిసి పార్టనర్‌షిప్‌లోనే పవన్‌ తన సినిమాలన్నీ చేస్తున్నాడు. ‘కాటమరాయుడు’కి గాను పవన్‌ పారితోషికం ఏదీ తీసుకోలేదు. నైజాం, సీడెడ్‌ రైట్స్‌ మాత్రం పవన్‌ తన పారితోషికంగా పెట్టుకున్నాడు. ఈ ఏరియాలకి అద్భుతమైన రేట్‌ పలకడంతో పవన్‌ జేబులోకి 30 కోట్లు వచ్చి పడ్డాయి.
సీడెడ్‌ పన్నెండు కోట్లకి, నైజాం పద్ధెనిమిది కోట్లకి అమ్ముడయ్యాయి. నైజాం నుంచి వచ్చింది ఇరవై కోట్లు అయినా కానీ ఇందులో రెండు కోట్లు బయ్యర్లకి రికవరబుల్‌. అంత వసూలు చేయని పక్షంలో ఆ రెండు కోట్లు తిరిగివ్వాలన్నమాట. ఇక ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయి ఓవర్‌ఫ్లోస్‌ కూడా తెచ్చుకుందంటే ఈ రెండు ఏరియాల మీద పవన్‌కి కనీసం మరో అయిదారు కోట్లు మిగులుతుంది.

ఎలా చూసుకున్నా కాటమరాయుడుపై పవన్‌ మినిమమ్‌ ఆదాయం ముప్పయ్‌ కోట్లన్నమాట. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కి క్రియేటివ్‌గా ఇన్‌వాల్వ్‌ అయిన పవన్‌ ఈసారి కాటమరాయుడికి అసలు జోక్యం చేసుకోలేదట. పూర్తిగా దర్శకుడు ఏది అనుకుంటే అది తీయమని ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చాడట. రిలీజ్‌ మాత్రం మార్చి 24న జరిగి తీరాలని ఆర్డర్‌ వేసాడట. అందుకు అనుగుణంగానే కాటమరాయుడు టీమ్‌ రౌండ్‌ ది క్లాక్‌ పని చేస్తూ షూటింగ్‌ పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది.