పిక్‌ టాక్‌: ఈమెని గుర్తు పట్టగలరా?

‘కాటమ రాయుడు’ రెండో పాట కూడా వచ్చేసింది. ‘లాగే లాగే’ అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్లపై వచ్చే డ్యూయట్‌ అని అర్థమవుతోంది. మెలోడీకి బీట్‌ మిక్స్‌ చేసి ఆకట్టుకునేలా ప్రెజెంట్‌ చేయాలనే తపన అయితే కనిపించింది కానీ అనూప్‌ ట్యూన్‌లో మేటర్‌లో లేదు. అతని ఆర్కెస్ట్రా ఎప్పుడూ వీక్‌ అనేది తెలిసిందే.

ట్యూన్‌ మీదే ఆధారపడే అనూప్‌ ఈ పాటకి మంచి బాణీ కట్టలేకపోయాడు. కాటమరాయుడు మొదటి పాట కూడా క్యాచీగా లేదని కామెంట్స్‌ వస్తున్నాయి. తాజాగా రెండో పాటతోను అనూప్‌ నిరాశ పరిచాడు. ఈ రెండు పాటలతోను సినిమాకి క్రేజ్‌ పెరగాల్సింది పోయి, టీజర్‌ తర్వాత వచ్చిన క్రేజ్‌ని ఇవి కాస్త తగ్గించాయి. అనూప్‌ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పుడే తమన్‌ని అయినా తీసుకోవాల్సిందని, క్వాలిటీ మ్యూజిక్‌ ఇచ్చేవాడని అభిమానులు అభిప్రాయపడ్డారు. వారు భయపడ్డట్టే అనూప్‌ అతిగా ట్రై చేస్తూ రెండు పాటలతోను నిరాశ పరిచాడు.

ఈ ఆడియోని ఒక్కసారిగా వదిలేస్తే మంచిదని, ఇలాంటి పాటలు ఒక్కొక్కటిగా వదలడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజువల్‌గా ఈ పాటల్ని అద్భుతంగా తీసినట్టయితే తప్ప సిగరెట్‌ బ్రేక్‌కి వెళ్లకుండా ఆడియన్స్‌ని కుర్చీల్లో కూర్చోబెట్టడమూ కష్టమే. పవన్‌కళ్యాణ్‌ లాంటి స్టార్‌తో పని చేసే అవకాశం వచ్చినపుడు ఇదేనా ఇవ్వాల్సిన అవుట్‌పుట్‌? కనీసం మిగతా పాటలతో అయినా అనూప్‌ తన టాలెంట్‌ చూపిస్తాడనే అభిమానులు ఆశ పడుతున్నారు.