వారం రోజుల్లో రూ.84 కోట్లు తెచ్చావా రాయుడూ

టాక్ ఎలా ఉన్నా.. వీకెండ్ తర్వాత నెమ్మదించినా.. తొలి వారంలో ‘కాటమరాయుడు’ ఓవరాల్ వసూళ్లు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ.54.75 కోట్ల షేర్.. రూ.84.6 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకు జరిగిన బిజినెస్ సంగతి పక్కనబెట్టేసి చూస్తే.. వారం రోజుల్లో ఇంత షేర్.. ఇంత గ్రాస్ అంటే మామూలు విషయం కాదు.

ఐతే ఇందులో 80 శాతానికి పైగా వసూళ్లు ఫస్ట్ వీకెండ్లో వచ్చినవే కావడం గమనార్హం. వీకెండ్ తర్వాత సినిమా డల్ అయింది. మధ్యలో బుధవారం ఉగాది సెలవు రోజు మినహాయిస్తే వసూళ్లు బాగా పడిపోయాయి. రెండో వీకెండ్లో కూడా సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తున్నారు. వీకెండ్ అయ్యేసరికి రూ.60 కోట్ల షేర్ మార్కును దాటొచ్చేమో. ఆ మార్కును అందుకున్నా.. సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే మాత్రం ఇంకో పాతిక కోట్ల దాకా షేర్ రాబట్టాలి. కాబట్టి బయ్యర్లకు భారీ నష్టాలైతే తప్పేలా లేవు.

తొలి వారంలో కాటమరాయుడు వరల్డ్ వైడ్ షేర్ వివరాలు, ఏరియాల వారీగా..

నైజాం-రూ.13 కోట్లు

వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.5.7 కోట్లు

తూర్పు గోదావ‌రి-రూ.4.97 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.3.93 కోట్లు

గుంటూరు-రూ.4.51 కోట్లు

కృష్ణా- రూ.3.29 కోట్లు

నెల్లూరు-రూ.1.9 కోట్లు

ఆంధ్రా- రూ.24.3 కోట్లు

సీడెడ్ (రాయలసీమ)- రూ.7.05 కోట్లు

క‌ర్ణాట‌క‌-రూ.5 కోట్లు

యుఎస్‌- రూ.3.2 కోట్లు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.44.35 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్‌- రూ.62.7 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ షేర్- రూ.54.75 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్‌-84.6 కోట్లు .