కరోనాతో అనాధలైన చిన్నారులకు ప్రతినెలా 2500 ఆర్ధికసాయం: సీఎం కేజ్రీవాల్

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు నెలకు 2500 ఆర్ధికసాయం అందిస్తున్నట్టు ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సాయం వారికి 25ఏళ్లు వచ్చేవరకూ కొనసాగిస్తామని అన్నారు. దీంతోపాటు వారికి ఉచిత విద్య కూడా అందిస్తామని ప్రకటిచారు. కరోనాతో మరణించిన కుటుంబాలకు ఆర్ధికసాయం కింద 50వేలు, ఇంట్లో సంపాదించే వ్యక్తి కోల్పోయినా.. వివాహం కాని కుమారుడు చనిపోయినా నెలకు 2500 నగదు ఇస్తామని కూడా ప్రకటించారు కేజ్రీవాల్.

ప్రస్తుత క్లిష్ట సమయంలో ఢిల్లీలోని 72 లక్షల రేషన్ కార్డు హోల్డర్లకు ఇప్పుడిస్తున్న 5కేజీల రేషన్ కు అదనంగా మరో 5కేజీలు కలిపి 10 కేజీల బియ్యం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకూ ఢిల్లీలో 21, 846 మంది కరోనాతో మృతి చెందినట్టు తెలిపారు. ఈక్రమంలో సింగపూర్ లో కొత్తరకం కరోనా వైరస్ వెలుగు చూసిందని.. అక్కడి విమానాలు భారత్ రాకుండా ఆదేశించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇది థర్డ్ వేవ్ కు దారి తీయొచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు.