మహేష్‌ కోసం అద్వానీ దిగుతోందా?

మహేష్‌తో కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందే ‘భరత్‌ అనే నేను’ త్వరలోనే మొదలు కానుంది. ఈ చిత్రానికి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరిగాయి. అప్పుడే దేవి మూడు ట్యూన్లు కూడా ఇచ్చేసాడు. మురుగదాస్‌ సినిమా పూర్తయితే మహేష్‌ ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడు.

మొదటి షెడ్యూల్‌ని విదేశాల్లో ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని, ‘ఒకే ఒక్కడు’ తరహాలో థ్రిల్లింగ్‌ పొలిటికల్‌ డ్రామా వుంటుందని చెబుతున్నారు. ఇదిలావుంటే ఇందులో ఇంతవరకు హీరోయిన్‌ ఖరారు కాలేదు. ముందుగా కీర్తి సురేష్‌ని అనుకున్నారు కానీ ఆమె బల్క్‌ డేట్స్‌ ఇవ్వలేకపోతోందట. అందుకని వేరే ఆప్షన్లు చూస్తున్నారు.

ఆల్రెడీ మహేష్‌తో చేసిన వారికంటే ఫ్రెష్‌ కాంబినేషన్‌ బెస్ట్‌ అని కొరటాల శివ అనుకుంటున్నాడు. అందుకే బాలీవుడ్‌ నుంచి కైరా అద్వానీని దించాలని చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పొడుగ్గా, నాజూగ్గా వుండే కైరా బాలీవుడ్‌ దృష్టిని ఆకట్టుకుని మంచి సినిమాలు చేజిక్కించుకుంటోంది. ఆమె అయితే మహేష్‌కి సరిజోడుగా వుంటుందని స్క్రీన్‌ టెస్ట్‌ కోసం పిలిపించారని తెలిసింది. అన్నీ ఓకే అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఈ సెక్సీ సుందరి కైవసమైనట్టే.