Koilamma Serial Episode 30th Online

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కోయిలమ్మ’ సీరియల్‌ 721 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 722 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ.. సరికొత్త రాగాలను పలిగిస్తున్న కోయిలమ్మ కథ ఏం జరిగిందో చూద్దాం!

గత ఎపిసోడ్‌లో జరిగిన కథ..

చిన్నీ ధన ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత రోడ్డు మీద పనిమనిషి పైడుతల్లి కనిపించడంతో.. రమేష్ చంద్రని చూడ్డానికి అత్తింటికి తీసుకుని వెళ్లమని బతిమలాడుతుంది. అందుకు పైడు తల్లి సరేనడటంతో ఇద్దరూ కలిసి ఆటోలో బయలుదేరతారు. ముఖానికి చున్నీ కట్టుకుని అందరి ముందుకీ వెళ్తుంది చిన్నీ. అదెలా అంటే.. పైడుతల్లి ఈ అమ్మాయి మా బస్తీ అమ్మాయేనని, తనకి ముఖంపైన అలర్జీ రావడం వల్ల.. మొత్తం పాడైందని, గాలి తలనీయొద్దని డాక్టర్‌ చెప్పారని అబద్దం చెబుతుంది. దాంతో ఎవ్వరూ ముఖానికి ఉన్న చున్నీ తీయమని అనరు.

టెన్షన్‌లో చిన్నీ..

రమేష్‌ చంద్రకే మెలుకువ వచ్చి ఉంటుందని.. ఒక్కసారిగా గతం గుర్తుకొచ్చి అలా జరిగి ఉంటుందని.. ఆలోచించుకుంటూ ఉంటారు. లోపలకి వచ్చిన పైడుతల్లి.. కోడలమ్మ(చిన్నీ) బాత్‌ రూమ్‌లో దాక్కుని ఉందని అర్థం చేసుకుని వాళ్లంతా వెళ్లగానే పక్కనుంచి బయటికి పంపించేస్తుంది.

రమేష్ చంద్ర ముందు చిన్నీ..

మొత్తానికీ రమేష్‌ చంద్ర గదిలోకి వెళ్లిన చిన్నీ రమేష్‌ చంద్ర కాళ్లకు దన్నం పెడుతుంది. దాంతో రమేష్‌ చంద్ర పైకి లేస్తాడు. ఎవరూ ఎవరూ అని అరుస్తాడు. ఇంతలో చిన్నీ అలజడికి పక్కనే మ్యూజిక్‌ సిస్టమ్‌ ఆన్‌ కావడంతో పెద్ద శబ్దంతో పాటలు వస్తుంటాయి. ఇంట్లో అంతా ఆ శబ్దానికి రమేష్‌ చంద్ర రూమ్‌కి పరుగుతీస్తారు. చిన్నీ బాత్‌ రూమ్‌లో దాక్కుంటుంది.

చిన్నీ కోసం వెతుకుతున్న ధన

అయితే ధనా.. చిన్నీ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అందరినీ అడుగుతాడు. అయితే పైడుతల్లితో కలిసి రాజు ఆటోలో ఎక్కడికో వెళ్లిందని తెలుసుకుని, రాజుని పట్టుకుని.. చిన్నీ ఎక్కడ దిగిందో అక్కడకు ధన వెళ్లిపోతాడు. అయితే అక్కడ అమర్‌ని చూసి షాక్‌ అవుతాడు ధన. గతంలో వాళ్లిద్దరి మధ్య గొడవ అవుతుంది. దాంతో అమర్‌ కోపంగా ‘నువ్వేంట్రా నా ఇంటి దగ్గరా?’ అంటూ అరుస్తాడు.

అమర్ ఆవేశం..

దాంతో ధన కోపంగా.. ‘ఇది నీ ఇల్లు అని నాకు తెలియదు..నేను మా బుజ్జమ్మ కోసం వచ్చాను. తను చాలా మంచి అమ్మాయి. ఇక్కడికే వచ్చిందట’ అనడంతో అమర్‌కి అనుమానం వస్తుంది. పైడు తల్లితో వచ్చిన అమ్మాయి చిన్నీ అయ్యి ఉండొచ్చని పరుగున ఇంట్లోకి వెళ్లి పైడుతల్లిని నిలదీస్తాడు. అయితే పైడుతల్లి నిజం చెప్పకుండా.. ‘ఆ అమ్మాయి మా బస్తీ అమ్మాయి. తనకు హెల్త్‌ బాగోక ఆసుపత్రికి వెళ్లింది బాబు’ అని చెప్పడంతో ఆవేశంగా అమర్‌ కారు తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్లిన అమ్మాయి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తాడు.

చిన్నీ సేఫ్

చిన్నీ బాధగా రోడ్డు మీద వెళ్లిపోతుంటే.. అమర్‌ వెనుకే కారు వేసుకుని అంతా వెతుక్కుంటూ వస్తాడు. ఓ గుడి దగ్గర తన బాధను, తన కష్టాలను తలుచుకుంటూ చిన్నీ బాగా ఏడుస్తుంది. కాసేపటికి అలా నడుస్తూ వెళ్తుంటే ధనకి చిన్నీ కనిపిస్తుంది. బతిమలాడి ఇంటికి తీసుకుని వెళ్తాడు. దాంతో అమర్‌కి ఇంటికి వచ్చిన అమ్మాయి చిన్నీనే అన్న నిజం తెలియలేదు. తర్వాత ధన తల్లి(చిన్నీ మేనత్త) ‘ఇదిగో బుజ్జమ్మా.. నిన్ను నేను ఏమన్నా అన్నానా.. వాడు నా మీద పడ్డాడు.. ఇక నుంచి ఇక్కడే ఉండాలి నువ్వు. నువ్వు వెళ్లిపోయి నా నెత్తిమీదకు తేవద్దు’ అంటుంది కఠినంగా. కోయిలమ్మ కొనసాగుతుంది.