ట్రెడిషనల్ హీరోయిన్ ఇలా రెచ్చిపోయిందేంటి?

కృతి కర్బందా అనగానే ఒక సంప్రదాయబద్ధమైన రూపం గుర్తుకొస్తుంది. తెలుగులో తొలి సినిమా ‘బోణీ’ దగ్గర్నుంచి.. చివరగా చేసిన ‘బ్రూస్ లీ’ వరకు చాలా పద్ధతిగానే కనిపిస్తూ వచ్చింది కృతి. ఓ మోస్తరుగా కూడా ఆమె అందాల ప్రదర్శన చేసింది లేదు. ఎప్పుడూ నిండైన దుస్తులతోనే దర్శనమిచ్చేది. తన సొంతగడ్డ శాండిల్‌వుడ్లోనూ ఆమె ట్రెడిషనల్‌గానే కనిపిస్తూ వచ్చింది.
అలాంటమ్మాయి సడెన్‌గా బాలీవుడ్లో ‘రాజ్-4’ లాంటి కొంచెం ఎరోటిక్ టచ్ ఉన్న థ్రిల్లర్లో నటించడం అందరికీ షాకే. అందులో హాట్ హాట్ లిప్ లాక్స్.. ఇంటిమేట్ సీన్లు చేసేసరికి కృతి ఆలోచనలు మారిపోయినట్లుంది. తాజాగా ఒక కార్యక్రమానికి కృతి తయారై వచ్చిన తీరు చూసి అందరికీ దిమ్మదిరిగిపోయింది. డీప్ క్లీవేజ్ షోతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇన్నాళ్లూ అంత పద్ధతిగా కనిపించిన అమ్మాయి.. ఇంత హాట్ హాట్‌గా తయారయ్యేసరికి కుర్రాళ్లకు మతిపోయింది. ఈ అందాల విందేదో ముందు నుంచి చేస్తూ వచ్చి ఉంటే కృతి కెరీర్ మరోలా ఉండేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు.