ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ పై ప్రభుత్వం కక్ష సాధిస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వ్యాపారాలపై ప్రభుత్వం దాడులు చేయడం జరిగింది. మొదట క్వారీని మూయించగా ఆయన ఫ్యాక్టరీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూయించేసింది. ఆయన కంపెనీలకు సరైన అనుమతులు లేవు అనే కారణం చూపించి మూయించడం జరిగింది. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యే అంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా గ్రానైట్ పరిశ్రమ నిర్వహిస్తున్న గొట్టి పాటి కుటుంబం వ్యాపారాలు పూర్తిగా స్థంభింపజేశారు. ఎమ్మెల్యే రవికుమార్ మరియు ఆయన సోదరుడి వ్యాపారాలు పూర్తిగా నిలిచి పోయాయి. ప్రభుత్వం వారి వ్యాపారాలపై ఉక్కు పాదం మోపింది. పరిశ్రమల్లో నెలకొన్ని పలు సమస్యల కారణంగా రూల్స్ ప్రకారం మూసేయించినట్లుగా చెబుతున్నారు. వైకాపా లో ఎమ్మెల్యే రవి చేరని కారణంగానే ఆయన కు చెందిన వ్యాపారాలపై ఇలా దాడులు చేయించి కక్ష సాధించారు అంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు