ఆ సంగీత దర్శకుడు పెద్ద ప్లేబాయ్‌?

నిన్న మొన్ననే టీనేజ్‌ దాటిన తమిళ సంగీత సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌ చూడ్డానికి ఇంకా పిల్లాడిలానే కనిపిస్తాడు. ‘కొలవెరి’ పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్‌ ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

ధనుష్‌కి మంచి స్నేహితుడైన అనిరుధ్‌ తమిళంలో ఎంత పాపులర్‌ అంటే, అతడిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం చాన్నాళ్లుగా జరుగుతోంది. కానీ అతను అక్కడ బిజీగా వుండడం వల్ల బ్రూస్‌లీ, అఆ చిత్రాలకి తీసుకున్న అడ్వాన్స్‌ కూడా తిరిగి ఇచ్చేసాడు. పవన్‌, త్రివిక్రమ్‌ సినిమాతో త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు. టాలెంట్‌ పుష్కలంగా వున్న ఈ కుర్రాడి కాండక్ట్‌ మంచిది కాదని ఇప్పటికే ఫోటో ఎవిడెన్స్‌లున్నాయి.

సింగర్‌ ఆండ్రియాతో పాటు పలువురు సింగర్స్‌, యాక్టర్స్‌తో అతనికి అఫైర్స్‌ వున్న సంగతి మీడియాలో కథలు కథలుగా వినిపించింది. తాజాగా సింగర్‌ సుచిత్ర అలిగేషన్స్‌తో అనిరుధ్‌ క్యారెక్టర్‌పై మళ్లీ క్వశ్చన్‌ మార్క్‌ పడింది. సుచిత్ర చాలా మంది సెలబ్రిటీల చీకటి బాగోతాలు బయటపెడతానంటూ హెచ్చరించగా, వాటిలో దాదాపుగా అన్నిటితోను అనిరుధ్‌కి లింక్‌ వుంది. సుచిత్ర డిలీట్‌ చేసిన పోస్ట్‌లలో కూడా అనిరుధ్‌ తనని ఎటాక్‌ చేసాడని, సెక్సువల్‌ అబ్యూజ్‌ చేసాడనే ఆరోపణలున్నాయి.

అలాగే అతడి మొబైల్‌లో చాలా మంది సెలబ్రిటీల న్యూడ్‌ వీడియోలు, ఫోటోలున్నాయనేది సుచిత్ర ఆరోపణ. ఆమె లీక్‌ చేసినవన్నీ కూడా సదరు మొబైల్‌నుంచి తీసుకున్నవే అన్నట్టుగా సుచిత్ర పేర్కొంది. చిన్న వయసులోనే చాలా సాధించిన అనిరుధ్‌ క్యారెక్టర్‌ అసాసినేషన్‌ అయితే జరిగిపోయింది. మరి దీనికి అతను ఇచ్చుకునే వివరణ ఎలాగుంటుందనేది వేచి చూడాల్సిందే.