నేను లోకల్ రిలీజ్ డేట్.. నాని భలే చెప్పాడు

నేచురల్ స్టార్ నాని ఏం చేసినా క్రియేటివ్ గా చేస్తాడు. ‘నేను లోకల్’ రిలీజ్ డేట్ విషయంలోనూ అలాగే చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్లో ‘నేను లోకల్’ రిలీజ్ డేట్ చెబుతూ నాని షేర్ చేసిన వీడియో అందరినీ భలే ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 3న ‘నేను లోకల్’ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ అయిన విషయాన్ని వీడియో ద్వారా తెలియజేశాడు నాని.

‘‘బాబు గాడి లవ్ స్టోరీని మీరు థియేటర్లలో చూడబోయే డేట్ ఫిక్సయపోయింది’’ అంటూ క్యాలెండర్ వైపు కెమెరా తీసుకెళ్లి.. 2017 ఫిబ్రవరి 3 తారీఖును చూపించాడు నాని. తర్వాత ‘‘చూడటానికి ఒక్క రీజన్ చెప్పండి అని మీరగడొచ్చు.. ట్రైలర్లో కీర్తి అడిగినట్లు.. కానీ చూడకుండా ఉండటానికి ఒక్క రీజన్ చెప్పండి. ఫిబ్రవరి 3.. మీ అందరినీ థియేటర్లలో కలుస్తా. ఇట్లు మీ నాని.. ఇట్లు మీ బాబు’’ అంటూ ముగించాడు నాని.

అలా ఆ రకంగా ‘నేను లోకల్’ రిలీజ్ డేట్ ప్రకటించాడు నాని. దిల్ రాజు నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇప్పటికే వరుసగా ఐదు హిట్లు కొట్టిన నాని ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించేయాలని చూస్తున్నాడు. ట్రైలర్ అదీ చూస్తే.. నాని ఆశ తీరేలాగే కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆల్రెడీ సూపర్ హిట్టయ్యాయి. మరి ఫుల్ పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతున్న ఈ చిత్రం అంచనాల్ని ఏమేరకు అందుకుంటుందో చూద్దాం.