శాతకర్ణి అనే వాడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. అందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలేమీ కూడా ఏమీ లేవు. దీంతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పాత్ర కోసం ఒక విచిత్రమైన లుక్‌లోకి మారాడు బాలయ్య. మీసం బాగా పెంచి వాటిని.. చెవుల పక్కనుండే జుట్టుకు కలిపి.. చిత్రంగా కనిపించాడు.
ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణ’ విడుదల తర్వాత కూడా కొన్నాళ్ల పాటు బాలయ్య అదే లుక్‌లో కనిపించడం గమనించే ఉంటారు. ఐతే ఈ మధ్యే పూరి జగన్నాథ్ సినిమా మొదలై.. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసేశారు కాబట్టి బాలయ్య లుక్ మారిపోయి ఉంటుందని.. ఆ సినిమాలో డాన్ పాత్ర కోసం కొత్త అవతారం ఎత్తి ఉంటాడని అంతా అనుకున్నారు.
కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జాతీయ అవార్డులు ప్రకటించినపుడు బాలయ్య లుక్ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగింది. దాదాపుగా శాతకర్ణి లుక్‌లోనే కనిపించాడు బాలయ్య ఇందులో. కాకపోతే మీసాన్ని తీసుకొచ్చి చెవుల పక్కన కలపలేదు. మీసమైతే భారీగా పెంచి.. దాన్ని కొంచెం కిందికి వదిలేశాడు. బాలయ్యను చూస్తే మాత్రం శాతకర్ణి లుక్కే గుర్తుకొస్తోంది. ఇంతకుముందు ‘సింహా’ సినిమాలో కూడా మీసం పెంచి కనిపించాడు బాలయ్య.
ఆ సినిమా కూడా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. బహుశా పొడవాటి మీసం బాలయ్యకు సెంటిమెంటుగా మారిందేమో. అందుకే పూరి సినిమాకు కూడా అలాగే కంటిన్యూ అయిపోతున్నట్లున్నాడు. మరి డాన్ పాత్రలో బాలయ్య అవతారం ఎలా ఉంటుందో చూద్దాం.