కాటమరాయుడుకి క్లారిటీ లేదింకా

కాటమరాయుడు ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవర్‌స్టార్‌ అభిమానులు యమ ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. రేపు ఉదయం ఆటతో సినిమా అధికారికంగా విడుదలవుతున్నది తెలిసిందే. అయితే కాస్ల ఎర్లీగా చూసేయాలని ఫాన్స్‌ బెనిఫిట్‌ షోల కోసం చూస్తున్నారు. అయితే బెనిఫిట్‌ షోల పరంగా మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు.

ఫలానా థియేటర్‌లో షో వేసుకుంటామంటూ ప్రదర్శనకారులు ఇప్పటికే పర్మిషన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే పోలీసుల నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇటీవల బెనిఫిట్‌ షోల విషయంలో పోలీసులు, ప్రభుత్వాలు స్ట్రిక్టుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వచ్చిన ఏ సినిమాకీ బెనిఫిట్‌ షోలకి పర్మిషన్లు ఇవ్వలేదు.

పండగ టైమ్‌ కాదు కనుక ఇప్పుడు ఇబ్బంది వుండదని అనుకున్నారు కానీ ఇంతవరకు అయితే పోలీసులు దిగి రాలేదు. ఓవైపు బెనిఫిట్‌ షో వేసుకోవడానికి లక్షల్లో థియేటర్లకి చెల్లించిన వాళ్లు షో వుంటుందా వుండదా అనే అనుమానంతో కాస్త ఆందోళనగా వున్నారు. ఈ నేపథ్యంలో కాటమరాయుడుకి ముందుగా తెర లేచేదెక్కడో చూడాలి.