మెగా కుర్రాళ్లలో ఇతడే టాప్‌

వరుణ్‌ తేజ్‌కి ఇంకా హిట్‌ పడకపోయి వుండొచ్చు కానీ అభిమానులకి మాత్రం అతడిలోనే పొటెన్షియల్‌ కనిపిస్తోంది. చరణ్‌, అల్లు అర్జున్‌ తర్వాత వచ్చిన మెగా హీరోల్లో వరుణ్‌ స్టార్‌ మెటీరియల్‌ అని వాళ్లు నమ్ముతున్నారు. అయితే వరుణ్‌ ఇంతవరకు కమర్షియల్‌ చిత్రాలు చేయకుండా ప్రయోగాలతో టైమ్‌పాస్‌ చేస్తూ వచ్చాడు. హిట్‌ పడకపోయినప్పటికీ ఏదో ఒక రోజు సడన్‌గా తారాపథంలోకి వెళ్లిపోతాడని ఫాన్స్‌ నమ్మకంగా వున్నారు.

ఇటీవల పరిచయమైన హీరోల్లో వరుణ్‌ చిత్రాలకి వుండే ప్రత్యేక క్రేజ్‌ ఏంటనేది అతని సినిమాల వీడియోలకి వచ్చే స్పందనే చెబుతుంది. సాయిధరమ్‌ తేజ్‌ చిత్రాలకి మాస్‌లో ఆదరణ వున్నప్పటికీ వరుణ్‌ తేజ్‌ మాదిరిగా అతని చిత్రాల పట్ల ఎక్సయిట్‌మెంట్‌ కనిపించదు. మిస్టర్‌ టీజర్‌తో ఒక్క రోజులో మిలియన్‌ వ్యూస్‌ సాధించిన వరుణ్‌ తేజ్‌ ఇప్పుడు ట్రెయిలర్‌తోను ఆ ఫీట్‌ రిపీట్‌ చేసి తన పట్ల జనాలకి వున్న ఆసక్తి యొక్క కన్సిస్టెన్సీ చాటుకున్నాడు.

వరుణ్‌ పెద్ద హీరో అవుతాడని అతడితో పని చేసిన దర్శకులంతా చెబుతూ వచ్చారు. అతను స్టార్‌ అవడానికి ఒక్క సినిమా దూరంలో వున్నాడనేది క్లియర్‌. మరి అతడిని స్టార్‌గా మార్చే సినిమా మిస్టర్‌ అవుతుందా, శేఖర్‌ కమ్ముల ఫిదాతో కుదుర్తుందా, లేక తదుపరి చిత్రం వరకు వెయిట్‌ చేయాల్సి వస్తుందా? ఇప్పుడున్న ఆసక్తి, నమ్మకాలు సన్నగిల్లక ముందే బాక్సాఫీస్‌ వద్ద జెండా పాతేసేయాలీ కుర్రాడు.