దున్నుకో డీజే.. దున్నుకో

కలిసొచ్చే కాలం వస్తే… అంటూ ఓ సామెత ఉంటుంది. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా rnటైం అలాగే ఉంది మరి. ‘బాహుబలి-2’ తర్వాత భారీ సినిమాలు లేక బాక్సాఫీస్ rnస్లంప్ లో ఉండగా.. ప్రేక్షకులు పెద్ద సినిమా కోసం ఆవురావురుమని ఎదురు rnచూస్తున్న సమయంలో పోటీ లేకుండా బరిలోకి దిగి తొలి వారాంతంలో అదిరిపోయే rnవసూళ్లు సాధించిందీ చిత్రం.

వీకెండ్ తర్వాత సోమవారం కూడా రంజాన్ సెలవు rnకలిసొచ్చి వసూళ్ల మోత కొనసాగింది. డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత rnవీక్ డేస్‌లో అయినా సినిమా వీక్ అవుతుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు.rn మంగళ, బుధవారాల్లో కూడా వసూళ్లు ఓ మోస్తరుగానే కొనసాగుతున్నాయి.

దీనికిrn తోడు రెండో వీకెండ్లో కూడా ‘దువ్వాడ జగన్నాథం’ దున్నుకునే అవకాశాలు rnకనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ శుక్రవారం రిలీజవుతున్న సినిమాల మీద జనాల్లో rnఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. ఈ వీకెండ్లో వస్తున్న సినిమాల్లో rnచెప్పుకోదగ్గది ‘జయదేవ్’ మాత్రమే. ఐతే దాని మీద కూడా పెద్దగా అంచనాల్లేవు. rnఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ హీరోగా rnపరిచయమవుతున్న ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి పెద్దగా కనిపించట్లేదు. దీనికి rnబుకింగ్స్ చాలా పూర్‌గా కనిపిస్తున్నాయి.

దీంతో పాటు వస్తున్న rnసంపూర్ణేష్ బాబు మూవీ ‘వైరస్’ను కూడా జనాలు పట్టించుకునే పరిస్థితిలో rnకనిపించట్లేదు. మరో సినిమా ‘పెళ్లికి ముందు ప్రేమకథ’ గురించి rnచెప్పుకోవడానికి ఏమీ లేదు. మొత్తానికి కొత్త సినిమాలేవీ కూడా జనాల దృష్టినిrn పెద్దగా ఆకర్షించే అవకాశం లేదు కాబట్టి ‘డీజే’కు రెండో వారాంతంలోనూ మంచి rnవసూళ్లే వచ్చేలా ఉన్నాయి. ఈ వీకెండ్ అయ్యాక సినిమా దాదాపుగా బ్రేక్ rnఈవెన్‌కు వచ్చేస్తుందేమో.