ఎన్టీఆర్ ఆ డేట్ మిస్ అవ్వకూడదు

గత ఏడాది ఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’ విడుదల చేద్దామని ప్లాన్ చేసినా అది డిలే అయి సెప్టెంబర్కి వెళ్లింది. అయినప్పటికీ పెద్దగా నష్టం జరగలేదు కానీ ముందుగా ప్లాన్ చేసిన డేట్కే వచ్చి వుంటే మరిన్ని వసూళ్లు వచ్చి ఉండేవి. ఈ యేడాదిలోను అలాంటి మంచి డేట్ ఇంకోటి కుదిరింది.

ఆగస్టు 11న, అంటే శుక్రవారం విడుదల చేసినట్టయితే, సోమవారం కృష్ణాష్టమి, మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవులు కలిసి వస్తాయి. ఫస్ట్ వీక్లో సూపర్ కలక్షన్లు తెచ్చుకోవడానికి చాలా అనుకూలమైన డేట్. అందుకే ఈసారి ఎన్టీఆర్ ఈ డేట్ మిస్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తోన్న ‘జై లవకుశ’ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకి వెళ్లనుంది. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయడానికే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే షూటింగ్ పరంగా ఎలాంటి ఆలస్యం లేకుండా, అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తప్ప ఇంత టైట్ షెడ్యూల్లో సినిమా రెడీ కాదు.

ఈ డేట్కి ఉన్న అడ్వాంటేజ్ని బట్టి మరిన్ని చిత్రాలు ఇదే టార్గెట్తో వచ్చే అవకాశాలున్నాయి కనుక ముందే డేట్ని పక్కాగా రిజర్వ్ చేసేసుకోకుంటే తర్వాత పోటీ తప్పదు. మరి ఈ డేట్ని ఎన్టీఆరే క్యాష్ చేసుకుంటాడో లేక మరింకెవరైనా లక్కీ ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి.