ఎన్టీఆర్‌ కూడా అతడికి ఫ్రీడమ్‌ ఇవ్వట్లేదా?

రచయితగా బాబీ చేసిన చిత్రాల లిస్టు గొప్పదేమీ కాదు. త్వరగానే పవర్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం పొందిన బాబీ ‘విక్రమార్కుడు’ కథనే అటు తిప్పి, ఇటు తిప్పి తీసేసి పాస్‌ మార్కులు కొట్టేసాడు. పవర్‌ చాలా యావరేజ్‌ సినిమా అయినప్పటికీ బాబీకి పవన్‌కల్యాణ్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చింది.

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రానికి పవన్‌ టీమ్‌ అతడిని డమ్మీని చేసి, నెల రోజుల్లో డెబ్బయ్‌ శాతం షూటింగ్‌ పూర్తి చేయడానికి గాను మూడు యూనిట్లు పెట్టి సినిమాని చుట్టి పారేసింది. అది డిజాస్టర్‌ అయినా కానీ ఎన్టీఆర్‌లాంటి మరో పెద్ద స్టార్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కింది. ఎన్టీఆర్‌తో త్రిపాత్రాభినయం చేయిస్తోన్న ఈ చిత్రం కోసం బాబీ ఎనిమిది నెలల సమయం అడిగాడు. ఎన్టీఆర్‌ అందుకు సరేనన్నాడు కానీ అనుకున్న రీతిన షూటింగ్‌ ముందుకి సాగడం లేదు. అయితే ఇది తన సోదరుడు కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తోన్న చిత్రం కావడంతో షూటింగ్‌లో డిలేని ఎన్టీఆర్‌ తేలిగ్గా తీసుకోవడం లేదు.

ఎలాగైనా ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలని బాబీపై ఎన్టీఆర్‌ ఒత్తిడి చేస్తున్నాడట. ఎట్టి పరిస్థితుల్లోను సెప్టెంబర్‌ 21న విడుదల కావాలని, దసరా సెలవులు మిస్‌ కారాదని చెప్పాడట. అయితే ఇంకా చిత్రీకరించాల్సిన పార్ట్‌ చాలా వుండడంతో బాబీ ఒత్తిడికి గురవుతున్నాడట. సర్దార్‌ తర్వాత తన కెరియర్‌కి డు ఆర్‌ డై లాంటి సినిమా కనుక అతను ఛాన్స్‌ తీసుకోలేక ప్రతి దానినీ కేర్‌ఫుల్‌గా తీద్దామని అనుకుంటే, సీజన్‌ అడ్వాంటేజ్‌ కోల్పోరాదని ఎన్టీఆర్‌ వైపు నుంచి ప్రెజర్‌ రోజు రోజుకీ పెరుగుతోందట. మరి ఈసారి బాబీ ఎలాంటి అవుట్‌పుట్‌ ఇస్తాడనేది చూడాల్సిందే.