అన్ని రికార్డులూ మటాష్‌… ఒక్కటి తప్ప

యుఎస్‌లో దంగల్‌ పేరిట వున్న అత్యధిక గ్రాస్‌ రికార్డుని బాహుబలి ఆరు రోజుల్లో అధిగమించింది. బాహుబలి 1 పేరిట వున్న ఆల్‌ ఇండియా హయ్యస్ట్‌ గ్రాసర్‌ రికార్డ్‌ని అయిదు రోజుల్లోనే బాహుబలి 2 బ్రేక్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన దంగల్‌ రికార్డుని కూడా ఆరు రోజుల్లో ‘బాహుబలి 2’ దాటేసింది.

కేవలం హిందీ వర్షన్‌తోనే హిందీ చిత్రాల అత్యధిక నెట్‌ వసూళ్లని దాటడం మినహా దాదాపు అన్ని లాంఛనాలనీ బాహుబలి పూర్తి చేసింది. దంగల్‌ పేరు మీద వున్న 375 కోట్ల నెట్‌ వసూళ్ల రికార్డుని దాటడానికి కాస్త సమయం పడుతుంది కానీ అది సాధ్యమేనని బాలీవుడ్‌ ట్రేడ్‌ అంటోంది.

మొదట్లో నూట యాభై కోట్ల గ్రాస్‌ వస్తే గొప్ప అన్నవాళ్లే ఇప్పుడు మూడు వందల కోట్ల నెట్‌ వసూళ్లు చాలా ఈజీ అనేస్తున్నారు. దగ్గర్లో ఈ చిత్రాన్ని ఛాలెంజ్‌ చేసే బాలీవుడ్‌ మూవీ ఏదీ లేకపోవడంతో బాహుబలి ఉధృతి మరికొన్ని వారాలు సాగుతుందని అంచనా వేస్తున్నారు. అత్యధిక గ్రాస్‌ రికార్డులని చాలా వేగంగా బ్రేక్‌ చేయడం వల్ల బ్యాలెన్స్‌ వున్న రికార్డులని దాటడానికి బాహుబలికి చాలా సమయం వుంది.

రెండవ వారం నుంచి వసూళ్లు ఎంతగా తగ్గుముఖం పట్టినా కానీ అల్టిమేట్‌గా రికార్డులన్నీ బ్రేక్‌ అయిపోవడానికి ఆస్కారముంది. తెలుగు రాష్ట్రాల్లోనే వంద కోట్లకి పైగా షేర్‌ సాధించిన ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో తెలుగు రాష్ట్రాల నుంచే నూట ఎనభై కోట్ల షేర్‌ తెచ్చుకుంటుందని అంచనా. అంటే బాహుబలికి వచ్చిన ఓవరాల్‌ తెలుగు షేర్‌ ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుందన్నమాట. కర్నాటక, యుఎస్‌ కలుపుకుంటే ఇది రెండు వందల యాభై కోట్ల పైమాటేనట!