పవన్‌కళ్యాణ్‌ అటెంప్ట్‌ అట్టర్‌ఫ్లాప్‌

స్పెషల్‌ స్టాటస్‌ కోసం విద్యార్థులు గళమెత్తిన నేపథ్యంలో తాను సంకల్పించిన ‘దేశ బచావో’ ఆల్బమ్‌ని ఆ నిశ్శబ్ధ నిరసనకి ముందే విడుదల చేస్తానంటూ పవన్‌కళ్యాణ్‌ ప్రకటించడంతో, ఆ పాటలు యువతకి ప్రేరణ కలిగించేవిగా వుంటాయని భావించారు.

తన సినిమాల్లో కమర్షియల్‌ పంథా వీడకుండానే అభ్యుదయ గీతాలని ఎంకరేజ్‌ చేసిన పవన్‌ నుంచి ఆల్బమ్‌ అంటే అది చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని అభిమానులు లెక్కగట్టారు. కానీ పవన్‌కళ్యాణ్‌ అందరినీ దారుణంగా నిరాశపరిచాడు. అన్నీ రీమిక్స్‌ పాటలతో వచ్చిన ఈ ఆల్బమ్‌ పర్పస్‌ ఏమిటనేది ఎవరికీ బోధ పడలేదు.

ఈ పాటల వల్ల ‘స్పెషల్‌ స్టాటస్‌’కి ఏ విధంగా ఉపయోగముందో పవన్‌కి అయినా తెలుసో లేదోనని అతని అభిమానులే అంటున్నారు. ఈ ఆల్బమ్‌ని ఎలాంటి ఫోర్‌గ్రౌండ్‌ లేకుండా రిలీజ్‌ చేసినట్టయితే వీటికి స్పందన ఎలా వుండేదో కానీ ఇప్పుడిలా ఉద్యమానికి లింక్‌ పెట్టడంతో పవన్‌ అటెంప్ట్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయింది.

పవన్‌కళ్యాణ్‌ స్వయంగా ట్వీట్‌ చేసినప్పటికీ ఈ పాటలకి యూట్యూబ్‌లో స్పందన రాలేదు. పవన్‌లాంటి స్టార్‌ ట్వీట్‌ చేస్తే కనీసం అయిదారు లక్షల మంది తొలి రోజే చూడాలి. కానీ ఈ పాటలకి ఆ స్థాయి రెస్పాన్స్‌ రాకపోగా, పెదవి విరుపులే వస్తున్నాయి. తన పాటలని రీమిక్స్‌ చేయించడం కంటే ఒకే ఒక్క పాటని రాయించి, బాణీ కట్టించి వదిలి వుంటే దాని ఎఫెక్ట్‌ వేరేలా వుండేది. ఈ విషయంలో పవన్‌ని ఎవరు గైడ్‌ చేశారో కానీ ఇది మాత్రం ఫెయిల్డ్‌ అటెంప్ట్‌గా మిగిలిపోయింది.