‘కాటమరాయుడు’లా చీప్‌గా ఉండదిది

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ బయ్యర్ల సంక్షేమం కోసమని తీసిన ‘కాటమరాయుడు’ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో లాగించేసారు. చీప్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో బి గ్రేడ్‌ సినిమాలని తలపించిన ‘కాటమరాయుడు’ చిత్రాన్ని కూడా భారీ రేట్లకే అమ్మేసారనుకోండి, అది వేరే సంగతి.

అయితే కథా పరంగా, నిర్మాణ విలువల పరంగా ఎక్కడా క్వాలిటీ పాటించని కాటమరాయుడిని మరిపించడానికి త్రివిక్రమ్‌ సినిమా వెంటనే సెట్స్‌ మీదకి వెళుతోంది. ఏప్రిల్‌ 6 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతుంది. దసరాకి సినిమా విడుదల చేసేలా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. లొకేషన్స్‌తో సహా అన్నీ ఈ చిత్రానికి ముందే డిసైడ్‌ అయిపోయాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ వంద కోట్ల బడ్జెట్‌ ఇచ్చాడట. పవన్‌, త్రివిక్రమ్‌ పారితోషికాలు కలుపుకుని ఈ చిత్రానికి వంద కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట.

థియేట్రికల్‌ బిజినెస్‌ నుంచే వంద కోట్లు వసూలు అయిపోయే అవకాశాలు ఎక్కువే కనుక ఇది నిర్మాతపై భారం అవదు. వంద కోట్లతో తీసే సినిమా క్వాలిటీ ఎలాగుంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే త్రివిక్రమ్‌ సినిమా అంటేనే వినోదానికి మినిమమ్‌ గ్యారెంటీ కనుక మిస్‌ఫైర్‌ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. పవన్‌ ఫాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాల్సిన పని లేకుండా ఈ చిత్రం ఇదే ఏడాదిలో విడుదల అయిపోతుందనడం వారికి స్వీట్‌ న్యూస్‌.