స్లిమ్ వెర్ష‌న్‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్‌

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి పెద్ద‌గా మార్పులు లేని ఫిజిక్ టాలీవుడ్ లో ఎవ‌రిందంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొద‌టిసినిమా నుంచి ఆ మ‌ధ్య వ‌ర‌కూ ఫిజిక్‌ను ఒకే షేప్ లో ఉండ‌టంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని చెప్పాలి. అలాంటి ప‌వ‌న్‌.. ఈ మ‌ధ్య విడుద‌లైన కాట‌మ‌రాయుడిలోకాస్తంత బొద్దుగా కనిపించార‌నే చెప్పాలి.

ఆయ‌న గ‌త సినిమాల‌తో పోలిస్తే.. కాట‌మ‌రాయుడిలో కాస్తంత డీ గ్లామ‌ర్డ్ గా క‌నిపించార‌న్న విమ‌ర్శ‌ను ప‌వ‌న్ ఎదుర్కొన్నార‌ని చెబుతారు. ఇటీవ‌ల కాలంలో పెద్ద‌గా బ‌య‌ట‌కు రాని ప‌వ‌న్‌.. త‌న బాడీ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమాలో స‌రికొత్త గెట‌ప్ లో ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో అన్నం పూర్తిగా తిన‌టం మానేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. క్యాల‌రీ ఫుడ్ కి కూడా దూర‌మైన‌ట్లుగా తెలుస్తోంది. బ‌రువు త‌గ్గించ‌టం కోసం పూర్తిగా లిక్విడ్స్ మీదా.. ప్ర‌త్యేక ఫుడ్ మీద మాత్ర‌మే దృష్టి పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయ‌న స‌న్నప‌డ్డార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్లిమ్ వెర్ష‌న్ లోకి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.