పవన్ … కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా?

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల స్పీడు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో అనుకున్న సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభించకముందే వీరు రిలీజ్ డేట్ ఫైనల్ చేసేశారు. దీంతో వారిది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.

పవన్, త్రివిక్రమ్ సినిమాను సెట్లపైకి ఎక్కించకముందే థియేటర్లకు ఎప్పుడెక్కించాలో డిసైడ్ చేసేశారు. ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.  కానీ.. ఆగస్ట్ 11న  సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

కాగా… ఆగస్ట్ 14న కృష్ణాష్టమి.. 15న ఇండిపెండెన్స్ డే హాలిడేస్ ఉన్నాయి.  దాంతో కొద్దిగా ముందు రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ డేట్ ఫిక్స్ చేశారట.  కానీ.. అసలు సెట్స్ పైకి వెళ్లకుండానే రిలీజ్ డేట్ అంటే.. ఆలోచించాల్సిందే.  నిజానికి ఫిబ్రవరి మొదటివారానికే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కాటమరాయుడు ఫినిష్ అయ్యే సరికే ఫిబ్రవరి పూర్తయిపోతుందట. అంటే మార్చ్ మొదటివారంలో కానీ త్రివిక్రమ్ సినిమాని పవన్ ప్రారంభించే పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఐదు నెలల్లో పవన్ కళ్యాణ్ తో భారీ చిత్రాన్ని పూర్తి చేయడం ఎంతవరకు సాధ్యమో చూడాలి.