మాస్టర్ దర్శకుడితో ప్రభాస్ సినిమా కన్ఫర్మ్

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులోనూ అన్ని ఇండస్ట్రీల నుండి దర్శకులు ప్రభాస్ తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్, తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ చిత్రం, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆది పురుష్ చేస్తోన్న ప్రభాస్ ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడితో పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఖైదీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా విజయ్ తో మాస్టర్ సినిమాను చేసాడు. ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా లోకేష్ విక్రమ్ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలుకాబోతోంది.

ఇదిలా ఉంటే లోకేష్ ఇటీవలే ప్రభాస్ ను కలిసి కథ చెప్పినట్లు, ప్రభాస్ కు ఆ కథ బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.