ఫోన్ ఉంటే పర్స్ ఉన్నట్లే.

డీమానిటైజేషన్ తర్వాత దేశంలో నగదు కష్టాలు ఎంత పెరిగాయో అందరికీ అనుభవమే. ఇప్పటివరకూ నగదు సంపాదించడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు సంపాదించడం కంటే.. బ్యాంక్ నుంచి మన డబ్బు మనం తెచ్చుకోవడమే పెద్ద సమస్య అయిపోయింది. కానీ విదేశాల్లో మాత్రం ఈ ప్రాసెస్ చాలా సింపుల్.

డీమానిటైజేషన్ ముందు కూడా మనం ఏటీఎంల ముందు నిలబడి డబ్బులు తీసుకునేవాళ్లం. కానీ అప్పుడు క్యూలు ఉండేవి కాదు. జనాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా మనీ తీసుకునేవాళ్లు. విదేశాల్లో మాత్రం ఎప్పుడైనా ఫోన్ చూపిస్తే చాలట ఏటీఎంలు డబ్బులిచ్చేస్తాయట.

ఏటీఎం కార్డులతో అవసరం లేకుండానే ఫోన్ చూపిస్తే డబ్బులొచ్చే టెక్నాలజీ ఇతర దేశాల్లో బాగా పాపులర్ అవుతుంది. బ్యాంక్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని.. క్యూఆర్ కోడ్ ను ఏటీఎంతో స్కాన్ చేయించాలి. ఏటీఎం స్కాన్ చేస్తే.. వెంటనే మనీ బయటకు వస్తుంది.

క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఏటీఎం వినియోగదారుల్ని గుర్తిస్తుంది. అమెరికా, ఆస్త్రేలియా, సింగపూర్, చైనా ల్లో ఇప్పటికే ఇది బాగా పాపులరైంది. మన దేశంలో కూడా త్వరలోనే ఈ పద్ధతి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ పద్ధతి వస్తే ఇక కార్డుల గోల తప్పినట్లే .