ఇక రాజమౌళి ధాటికి తట్టుకునేదెవరు?

‘బాహుబలి 2’ చిత్రం అనుకున్న టైమ్కి వస్తుందా, రాదా అనే అనుమానాలకి తెర దించేయవచ్చు. ఎందుకంటే ఇప్పట్నుంచి సరిగ్గా వంద రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానుందని నిర్మాతలు స్పష్టం చేసారు.

వంద రోజుల కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని, బాహుబలి వచ్చేస్తున్నాడని నిర్మాత ప్రకటించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఏప్రిల్ 28న వస్తుందని అంటున్నారు కానీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తయినప్పుడు కదా అని అంతా అనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ఈ డేట్ మిస్ అవ్వకూడదని ధృడ నిశ్చయంతో ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ఏప్రిల్ 28కి వస్తే ఇటు తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ వెర్షన్స్ రిలీజ్కి కూడా ఎలాంటి ఆటంకాలుండవు.

ఆ టైమ్లో వేరే పెద్ద సినిమాల రిలీజ్లు లేవు కనుక అన్ని చోట్ల కలెక్షన్ల పంట పండించుకోవచ్చు. పైగా వేసవి సెలవుల్లో విడుదల చేస్తే అడిషినల్ అడ్వాంటేజ్ ఉంటుంది.

ఇంతవరకు రాజమౌళి సినిమాలన్నీ రాంగ్ సీజన్లలోనే రిలీజయ్యాయి. అయినప్పటికీ అవన్నీ పెద్ద హిట్ అయ్యాయి. రాజమౌళి సినిమాకి సీజన్ కూడా కలిసి వస్తే ఎలాగుంటుందనేది బాహుబలి 2 నిరూపించనుంది.