తూత్తుకుడి కేసులో రజినీకాంత్ సమన్లు జారీ

సూపర్ స్టార్ రజినీకాంత్ కు వివాదాలు కొత్తేమి కాదు. అయితే 2018లో చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు ఇప్పుడు సమన్లు జారీ అయ్యాయి. 2018లో తూత్తుకుడి స్టెర్లైట్ ఫ్యాక్టరీ హింసాత్మక ఘటన కేసులో రజినీకాంత్ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.

2018లో వేదాంత స్టెర్లైట్ కాపర్ మెల్టింగ్ ప్లాంట్ ను శాశ్వతంగా మూసివేయాలని అక్కడి స్థానికులు కోరుతూ నిరసనలు వ్యక్తం చేసాయి. పోలీసులతో స్థానికులకు జరిగిన ఘర్షణ కారణంగా అప్పుడు 13 మంది మరణించారు. ఈ సంఘటన విషయంలో రజినీకాంత్ సంఘ విద్రోహుల శక్తులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ ఘటనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అప్పట్లో రజినీ చెప్పారు.

ఇంతకుముందు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీషన్ రజనీకాంత్ ను కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోరారు. కానీ రజినీ దీనికి మినహాయింపు కోరారు. ప్రస్తుతం రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరోసారి వివాదం రేపాయి.