శ్రీరెడ్డి టాలీవుడ్ ప్రముఖులపై చేసిన కామెంట్స్, ఆరోపణలను ఎవ్వరు మర్చిపోలేరు. సంచలన కామెంట్స్ చేసి సినీ ప్రముఖులను ఒక ఆట ఆడేసుకున్న శ్రీరెడ్డి ఈమద్య కాస్త సైలెంట్ అయ్యింది అనుకుంటే మళ్లీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా హడావుడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఈమద్య రానా పెళ్లి ఫిక్స్ అయిన సందర్బంగా నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు. నీ కొత్త జీవితం సంతోషంగా ఉండాలంటూ కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది.
ఇక నేడు రానా వివాహ నిశ్చితార్థంకు అంతా రెడీ అయ్యింది. ఈ సమయంలోనే ఈమె మరోసారి తనదైన శైలిలో కామెంట్ చేసింది. నేడు సాయంత్రం రానా నిశ్చితార్థం రామానాయుడు స్టూడియోలో జరుగనున్న నేపథ్యంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో.. రానా బావకు నేడు ఎంగేజ్మెంట్. రామానాయుడు స్టూడియోలో ఆయన ఎంగేజ్ మెంట్ తర్వాత నాదే అంటూ ఫన్నీ ఈమోజీని పోస్ట్ చేసింది. రానా తమ్ముడు అభిరామ్‌తో శ్రీరెడ్డి వ్యవహారం ఆమద్య కాలంలో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
అభిరామ్తోనే ఈమె ఇంకా ప్రేమలో ఉందా అంటూ తాజా పోస్ట్‌తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెతో సురేష్‌బాబు కుటుంబం అస్సలు ఒప్పుకోక పోవచ్చు. ఆమె సరదాగా సురేష్‌బాబు ఫ్యామిలీని టార్గెట్ చేసే విషయంలో అలాంటి పోస్ట్‌లు పెట్టి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంతోషకర సమయంలో వారిని ఇలా మానసికంగా హింసించడం భావ్యం కాదని కొందరు అంటున్నారు.