మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ కొట్టి ఊపు మీదున్న తేజ్ ప్రస్తుతం సీరియస్ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నాడు. విమర్శకుల ప్రశంసలు అందుకునే దేవ్ కట్టా దర్శకత్వంలో తేజ్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి రిపబ్లిక్ అనే ఆసక్తికర టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.
వ్యవస్థ, ప్రజలు, రాజకీయం లాంటి సీరియస్ కాన్సెప్ట్ చుట్టూ రిపబ్లిక్ స్టోరీ నడుస్తున్నట్లు ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఫ్యూడల్ వ్యవస్థపై తేజ్ ఎక్కుపెట్టిన అస్త్రంగా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.
టీజర్ అంతా ఆకట్టుకునే, ప్రశ్నించే డైలాగులు ఉన్నాయి. టీజర్ వరకూ ఇంప్రెస్ చేసింది. జూన్ 4న విడుదలవుతోన్న ఈ చిత్రం మరి అంచనాలను అందుకుంటుందా అన్నది చూడాలి. ప్రస్థానం తర్వాత సరైన హిట్ లేని దేవా కట్టా కమర్షియల్ సక్సెస్ ను అందుకుంటాడా?