నీ సోలో ఇంకా కొన్ని రోజులే – చిరు; థాంక్స్ మామ – తేజ్

ఈరోజు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ నుండి మూడో పాట విడుదలైంది. గతేడాది రెండు సూపర్ హిట్స్ ను అందుకున్నాడు తేజ్. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.

ఇక ఈరోజు తేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోలో బ్రతుకే సో బెటర్ నుండి మూడో పాట అమృతను విడుదల చేసాడు. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన విషెస్ ఫన్నీగా ఉన్నాయి. “డియర్ సాయి ధరమ్ తేజ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్యాచలర్ గా ఉన్నప్పుడే లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చెయ్. అయినా నీకు ఈ సోలో డేస్ కొన్ని రోజులేగా” అని ట్వీట్ చేసాడు.

సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా తేజ్ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఇంట్లో తేజ్ కు సంబంధం చూసారని, త్వరలోనే దీనికి సంబంధించిన వార్త బయటకు వస్తుందని అన్నారు. ఇక చిరు పుట్టినరోజు విషెస్ కు తేజ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. థాంక్స్ మామ అని అంటూనే నీ పుట్టినరోజుకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అని ట్వీట్ చేసాడు.