మెగా క్యాంప్ కు బాలయ్య స్ఫూర్తి?

గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో.. తెలుగు సినిమా ప్రేక్షకుల మధ్య నడుస్తున్న కామెంట్ల యుద్ధం అంతా ఇంతా కాదు. ఇద్దరు అగ్రహీరోల ల్యాండ్ మార్క్ సినిమాలు రోజు తేడాతో థియేటర్లలో ల్యాండ్ అవుతున్నవేళ.. ఇద్దరి హీరోల మధ్య కంటేకూడా వారిఅభిమానుల మధ్య రగిలిన వేడి అంతా ఇంతా కాదు. గతంలో ఇద్దరు కలిసినప్పుడు వచ్చే మాటల్లో మాత్రమే చర్చలు జరిగేవి.

టెక్నాలజీ పుణ్యమా అని అందరి దరి చేరిన సోషల్ మీడియాతో గడిచిన కొద్దిరోజులుగా చిరు -బాలయ్య ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న వాడీ వేడీ కామెంట్లు మరింత పెరుగుతున్నాయి.

ఇలాంటి వేళ.. మెగా క్యాంప్ లోని మెగా హీరో సాయిధరమ్ తేజ ఆసక్తికరమైన ట్వీట్ ఒకటి చేశారు. నందమూరి బాలకృష్ణ తమలో చాలామందికి స్ఫూర్తిగా పేర్కొన్నారు. గౌతమి పుత్రశాతకర్ణికి గొప్ప స్పందన వస్తోందని తాను విన్నానని చెప్పారు. దర్శకుడు క్రిష్.. మొత్తం చిత్ర బృందానికి అభినందనలు చెప్పిన అతడు.. బాలయ్య తమలో  స్ఫూర్తి నింపారంటూ చేసిన వ్యాఖ్యలో..  ‘స్ఫూర్తి’ కోణం అర్థం కాని ఫజిల్ గా మారిందని చెప్పాలి.

ఇంతకీ.. మెగా క్యాంప్ కు బాలయ్య స్ఫూర్తి ఏ విధంగానో సాయి ధరమ్ తేజ చెప్పి పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది కదా.