అక్కడ కాస్త దృష్టి పెట్టు కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాజూకు అందాలతో ఎంత చూసినా తనివితీరని అందం ఆమె సొంతం. సినిమా సినిమాకు అందాల్ని పెంచేస్తూ.. చెలరేగిపోయే అమ్మడు.. తాజాగా మెగాస్టార్ పక్కన మరింతగా మెరిసిపోయింది.

క్లైమాక్స్ లో కోర్టు దగ్గర సీన్ తప్పించి.. సినిమా మొత్తంలో అమ్మడ్ని.. ఆమె అందాన్ని ఎక్కడా వంక పెట్టలేం. ఈ మధ్యన కనిపించిన దాని కంటే అందంగా కనిపించిన కాజల్ లో ఒక్క విషయంలో కేర్ తీసుకోవటం లేదేమోనన్నసందేహం కలుగుతుంది ఖైదీ సినిమా చూస్తే. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అయినా.. పిసరంత కండ పట్టకుండా.. వయసు మీద పడితే వచ్చి పడే మడతల్ని దరి చేరకుండా జాగ్రత్తపడే కాజల్.. చేతుల మీద పెద్దగా ఫోకస్ చేయటం లేదన్నట్లుగా ఉంది.

కొన్ని సీన్లలో అమ్మడి చేతుల మీద ముడతలు కాస్త కనిపించాయి. కాజల్ లాంటి మెరుపుతీగ.. బాడీ మొత్తాన్ని పర్ ఫెక్ట్ గా మొయింటైన్ చేస్తున్నప్పుడు.. చేతుల మీద అంత చిన్నచూపు ఏల అన్న సందేహం రావటం ఖాయం. కావాలంటే.. ఖైదీ సినిమాలో అమ్మడి చేతుల్ని మరికాస్త నిశితంగా పరిశీలిస్తే.. అమ్మడి నిర్లక్ష్యం కనిపించేస్తుంది.