మహేష్ లుక్స్ కు స్టన్ అవుతుంటా: సాయి పల్లవి

ఫిదాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది సాయిపల్లవి. ఈ సినిమాతో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది. అక్కడి నుండి సాయి పల్లవి వెనుతిరిగి చూసింది లేదు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి రీసెంట్ గా నటించిన ఆంథోలోజి చిత్రం పావ కాధైగల్. ఈ చిత్రం డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో సాయి పల్లవి రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో రాపిడ్ ఫైర్ రౌండ్ లో హీరోల గురించి ఒక్క వర్డ్ లో వర్ణించమని అడిగారు. అల్లు అర్జున్ గురించి అడగ్గా సూపర్బ్ డ్యాన్సర్ అని చెప్పింది సాయి పల్లవి. ఇక మహేష్ బాబు గురించి అడిగినప్పుడు సాయి పల్లవి చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.

“మహేష్ చాలా అందంగా ఉంటారు. తనకు స్కిన్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. మాములు మనుషులకు అలాంటి మెరిసే స్కిన్ ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటా. మహేష్ పిక్స్ ను జూమ్ చేసి మరీ ఈ విషయాన్ని చెక్ చేస్తుంటా” అని సాయి పల్లవి సమాధానమిచ్చింది.

ఇక నాని సరసన శ్యామ్ సింగ రాయ్ లో నటించనుంది సాయి పల్లవి. ఆమె నటించిన విరాటపర్వం షూటింగ్ పూర్తైన విషయం తెల్సిందే.