సలార్‌ ఏ భాష చిత్రమో తేలిపోయింది

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. క్రేజీ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న సలార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ప్రారంభం కాకముందు నుండే అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌ 2 సినిమాతో ఆల్‌ ఇండియా రేంజ్ లో అంచనాలను కలిగి ఉన్న దర్శకుడు ప్రశాంత్‌ సలార్‌ సినిమాను అంతకు మించిన యాక్షన్‌ సన్నివేశాలతో చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్‌ సినిమాను కన్నడ భాషలో చిత్రీకరిస్తున్నారట. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ రెండు పార్ట్‌ లను కూడా కన్నడంలో రూపొందించాడు. ఇతర భాషలకు డబ్‌ చేశాడు. ఇక సలార్‌ సినిమాను ఏ భాషలో రూపొందిస్తున్నాడు అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చ జరిగింది. తాజాగా ఆ ప్రశ్నకు సమాధానం లభించినట్లయ్యింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌ మెంబర్స్ ఈ విషయమై స్పష్టతనిచ్చారు. కన్నడంలో సలార్‌ రూపొందుతుంది. కాని కొన్ని కీలక సన్నివేశాలను మాత్రం తెలుగు మరియు హిందీ వర్షన్‌ ల్లో కూడా రూపొందిస్తున్నారట. అలా ఈ సినిమా అన్ని భాషలను కవర్‌ చేస్తుందన్నమాట. ఇదో సరికొత్త ట్రెండ్‌ కు తెర తీస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు.