ఎప్పుడూ ఏదో ఒక సెలబ్రిటీ మీద రూమర్లను క్రియేట్ చేసె వర్గం ఇప్పుడు మరోసారి అక్కినేనివారి కోడలును టార్గెట్ చేశారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటుందని టార్గెట్ చేస్తే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వల్లే దూరంగా ఉంటోందని రూమర్లు క్రియేట్ చేశారు.
పెళ్లైన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోసింది సమంత. బీచ్లో బికినీల్లో సేదతీరుతూ ఉన్న ఫోటోలను చూసి, అక్కినేని ఫ్యాన్స్ కొందరు ‘ఔరా!’ అని నోరెళ్లబెట్టారు. అయినా అవేమీ పట్టనట్టు తన స్టైల్లో తాను దూసుకెళ్లిపోయింది సామ్. జిమ్లో హెవీ వర్కవుట్స్ చేస్తున్న హాట్ వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే కొన్నిరోజులుగా సమంత సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో తల్లి కాబోతుందంటూ మరోసారి వార్తలు షికార్లు చేస్తున్నారు.
నాలుగు వారాలుగా సమంత తన ఫోటోలను పోస్ట్ చేయకపోవడంతో ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె కడుపు పెరిగిపోయిందని, అది తెలిసిపోతుందనే సోషల్ మీడియాకు దూరంగా ఉంటోందని కథనాలు అల్లేస్తున్నారు చాలామంది. సామ్ ప్రెగ్నెంట్ అయ్యిందంటూ పుకార్లు రావడం ఇప్పుడేమీ కొత్త కాదు. చాలాసార్లు ఆమె గురించి ఇలాంటి వార్తలు షికార్లు చేశాయి.
సమంత ఏదైనా సినిమా ఒప్పుకోకపోయినా, ఫంక్షన్లకు రాకపోయినా ప్రెగ్నెన్సీ రావడం వల్లే ఆమె ఇలా చేసిందంటూ సోషల్ మీడియా వార్తలు అల్లేశారు చాలామంది. అయితే ఇలాంటి వార్తలు వండేవారికి గట్టిగా సమాధానం ఇస్తూ వచ్చింది సమంత.
కాకపోతే ఇప్పుడు గ్యాప్ ఎందుకు తీసుకుందో తెలియదు కాని, ప్రెగ్నెన్సీ అనేది మాత్రం రూమరే అంటున్నారు సన్నిహితులు.