బజార్ రౌడీ సెట్స్ లో గాయపడ్డ సంపూర్ణేష్ బాబు

హీరో సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అవసరం లేదు. హృదయ కాలేయం సినిమాతో హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంపూర్ణేష్ బాబు వరసగా సెటైరికల్ మూవీస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం బజార్ రౌడీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటున్న సందర్భంలో సంపూర్ణేష్ కు గాయాలయ్యాయి.

బైక్ పై రోప్ స్టంట్ ను చేస్తుండగా అదుపుతప్పడంతో ఎత్తు నుండి కిందకి పడిపోయాడు సంపూర్ణేష్ బాబు. వెంటనే సెట్స్ లో వారు అప్రమత్తమై హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సినిమా సెట్స్ నుండి అందిన తాజా సమాచారం ప్రకారం, సంపూర్ణేష్ బాబుకు ప్రస్తుతం బాగానే ఉంది. త్వరలోనే తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు గాయపడ్డ వీడియో వైరల్ అవుతోంది.