రియ‌ల్ ఐటీ ల‌వ్‌కు రీల్ ట‌చ్

ఐటీ ల‌వ్‌ను వెండితెర మీద ఆవిష్క‌రించ‌టం అంటే అంతో ఇంతో శృంగారం ఖాయ‌మ‌నుకుంటారు. కానీ.. అందుకు భిన్నంగా ఒక్క‌టంటే ఒక్క క‌ట్ కూడా లేకుండా క్లీన్ గా మూవీ చేసేశార‌ట‌.

రియ‌ల్ లైఫ్ లో ఐటీ రంగంలో ప‌ని చేసే యువ‌తీ యువ‌కులు ఎలా ప్రేమించుకుంటారు.. ఎలా విడిపోతున్నారు? లాంటి రియ‌లిస్టిక్ అంశాల్ని వెండితెర మీద చూపిస్తారంటే.. అంతోఇంతో రొమాన్స్‌ను ఆశించ‌టం ఖాయం.

అందులోకి శింబు లాంటి స‌ర‌సుడు.. అత‌డితో జ‌త క‌ట్టిన న‌య‌న‌తార..ఆండ్రియా.. ఆదాశ‌ర్మ అంటే ఇంకేం ఉంది? అనుకుంటాం. కానీ.. అలాంటి ఆశ‌ల‌కు చెక్ చెబుతూ.. సినిమాను క్లీన్ గా తీశార‌ట‌. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు ఏకంగా యూ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌ట‌మే కాదు.. సినిమా చాలా బాగుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశార‌ట‌.

రియ‌ల్ లైఫ్ ను రీల్ లో చూపించిన ఈ మూవీని జులైలో ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. ఈ సినిమా స‌క్సెస్ ప‌క్కా అన్న విష‌యం.. సెన్సార్ స‌భ్యుల రియాక్ష‌న్లోనే అర్థ‌మైంద‌ని చెబుతున్నారు. త‌మిళంతో పాటు.. తెలుగులోనూ అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో శింబు మ‌రోసారి చెల‌రేగిపోవ‌టం ఖాయ‌మంటున్నారు.