అవార్డులు రాకున్నా ఫ‌ర్లేదు.. ఆ ప‌ని చేయ‌ద‌ట‌

టాలీవుడ్ లో ల‌క్కీ గాళ్ ఎవ‌ర‌న్న మాట‌కు ట‌క్కున చెప్పే పేరు ర‌కుల్‌. ఆమె చేసిన సినిమాలు పెద్ద‌గా వ‌ర్క్ వుట్ కాకున్నా.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఛాన్సులు ద‌క్కించుకుంటుంద‌న్న పేరు ఆమె సొంతం. గ్లామ‌ర్ డోసుతో ఇంత‌కాలం నెట్టుకొచ్చిన ర‌కుల్‌.. తాజాగా వ‌చ్చిన రారండోయ్ మూవీతో త‌న ఇమేజ్ మొత్తాన్ని మార్చేసుకుంది.

అందాల‌న్నీ దాచేసి చేసి సినిమాలో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించిన ర‌కుల్‌.. భ్ర‌మ‌రాంబ‌గా తెలుగువారి మ‌న‌సుల్లో రిజిస్ట‌ర్ అయిపోయింది. కొత్త‌గా వ‌చ్చి ప‌డ్డ ఇమేజ్ తో ర‌కుల్ ఫుల్ హ్యాపీగా ఉంది. తాజాగా ప్రిన్స్ మ‌హేశ్ తో స్పైడ‌ర్‌లో న‌టిస్తున్న ఈ అమ్మ‌డు.. వ‌చ్చిన ఛాన్స్ ల‌ను వ‌చ్చిన‌ట్లు ఒప్పేసుకోవ‌టానికి నో అంటే నో అనేస్తోంది. వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లే త‌ప్పించి.. అంత‌కు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెబుతోంది.

త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు చేస్తానని.. ప్ర‌యోగాత్మ‌కం అంటూ అన‌వ‌స‌ర‌మైన రిస్క్ ల జోలికి అస‌లు వెళ్ల‌నంటే వెళ్ల‌న‌ని చెబుతోంది. అవార్డుల కోసం  ఏదేదో చేసేయ‌టం త‌న వ‌ల్ల కాదంటోంది. అవార్డులు రాకున్నా ఫ‌ర్లేదు.. చెడ్డ‌పేరు మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో ద‌రి చేర‌నివ్వ‌న‌ని చెబుతున్న ఆమె.. అంద‌రికంటే ప్ర‌త్యేకంగా కనిపించాల‌న్న తొంద‌ర్లో కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తే మొద‌టికే మోసం రావొచ్చ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తోంది. సేఫ్ ప్రాజెక్టుల‌కు మాత్ర‌మే ఓకే అనేసే ర‌కుల్ తెలివి చూస్తే.. అమ్మ‌డు మ‌రికొంత‌కాలం త‌న హ‌వాను న‌డిపిస్తాద‌న‌టంలో ఎలాంటి సందేహం లేన‌ట్లే.