హాట్‌: అమ్మడు ఓ రేంజ్‌ కుమ్ముడు

తగ్గేదే లేదంటోంది సీరత్‌ కపూర్‌. తన ఒక్కో ఫోటోకీ జనం పిచ్చెత్తిపోతుంటే, ఇదేమి చూసారు, ఇది చూడండి అన్నట్టుగా దాని కంటే హాట్‌ ఫోటో వదులుతోంది. లాంజరీ వేర్‌లో చుట్ట పట్టుకుని పొగలు కక్కుతోన్న అందానికి పర్యాయ పదంలా కనిపిస్తోన్న సీరత్‌ ఫోటోకి లైక్‌లు, కామెంట్లు పిచ్చ పిచ్చగా వచ్చి పడిపోతున్నాయి. సాధారణంగా ఈ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ వుంటే మరీ డెస్పరేట్‌గా వుందంటూ తిట్టి పోస్తుంటారు.

సంస్కృతీ సాంప్రదాయాలు మంటగలిపేస్తున్నావంటూ సాంప్రదాయ వాదులు కన్నెర్ర చేస్తుంటారు. కానీ సీరత్‌ ఎంత గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తోందంటే, ఆమె ప్రతి ఫోటోకీ తర్వాత ఏం రాబోతోందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంతకుమించి చేయలేదని అనిపించిన ప్రతిసారీ మునుపటి ఫోటోని తలదన్నే ఫోటో వదిలి తన రేంజ్‌ ఏంటనేది చూపిస్తోంది. అందాల ప్రదర్శన విషయంలో ఎంత ఓపెన్‌గా వుందో క్లియర్‌గా చాటుకుంటోన్న సీరత్‌ కపూర్‌ని ఇదే స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించబోయేది ఎవరో కానీ కుర్రాళ్లకి ఆ సినిమాతో కనుల పంట పక్కా.