జగన్‌ సాబ్‌ దెబ్బకి కొనేవాడే లేడు

పూరి జగన్నాథ్‌ అంటే ఒకప్పుడు హాట్‌ సెల్లింగ్‌ బ్రాండే కానీ ఇటీవల అతను తీసిన సినిమాల వల్ల, వాటి వల్ల వచ్చిన నష్టాల వల్ల బయ్యర్లకి భయం పట్టుకుంది. పూరి ఎవరైనా పేరున్న హీరోతో సినిమా తీస్తే అది ఇప్పటికీ సేల్‌ అవుతుంది కానీ హీరో ఎవరనేది ఎవరికీ తెలియకపోతే మాత్రం జగన్‌ సినిమాని కొనేందుకు ఎవరూ ధైర్యం చేయట్లేదు. కొత్త హీరో ఇషాన్‌తో పూరి తీసిన ‘రోగ్‌’ ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఫేస్‌ చేస్తోంది. ఈ చిత్రానికి ఇంతవరకు బిజినెస్‌ జరగలేదు.

ఇక జరుగుతుందనే హోప్స్‌ లేకపోయేసరికి విడుదల వాయిదా వేసుకోవడం కంటే తాడో పేడో తేల్చుకోవడానికే నిర్మాత డిసైడయ్యాడు. హీరో తన సోదరుడే కావడంతో ‘రోగ్‌’ మీద టోటల్‌ రిస్క్‌ సి.ఆర్‌. మనోహర్‌ భరిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడంలో కూడా పూర్తిగా తనే రిలీజ్‌ చేస్తున్నాడు. బయ్యర్లలో జగన్‌కి క్రేజ్‌ తగ్గినా అతని బ్రాండ్‌ వేల్యూతో ఓపెనింగ్స్‌ వస్తాయని నిర్మాత నమ్మకం పెట్టుకున్నాడు.

అయితే రోగ్‌కి సంబంధించి ఇంతవరకు ఏ విషయం ఎక్సయిట్‌ చేయకపోయే సరికి దీనిపై జనాల్లో కూడా అంత ఆసక్తి వున్నట్టు లేదు. కాటమరాయుడు తర్వాత వస్తోన్న రోగ్‌ చిత్రం భవిష్యత్తు పవన్‌ సినిమా ఫలితంపై డిపెండ్‌ అవుతుంది. కాటమరాయుడు కనుక మాస్‌తో కనక్ట్‌ అయితే రోగ్‌కి బాక్సాఫీస్‌ వద్ద ఇబ్బందులు తప్పవు.