హాట్‌: స్కిన్‌ షో షురూ చేసిందిగా

ఎక్స్‌పోజింగ్‌కి వ్యతిరేకం అంటూ చెబుతూ వచ్చిన సోనాక్షి సిన్హా ఇంతకాలం ఆ మాట మీదే నిలబడింది. అయితే వరుస వైఫల్యాలతో ఉనికి కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తూ వుండడంతో ఇక అందాల ప్రదర్శన షురూ చేయక తప్పదని భావిస్తున్నట్టుంది.

ఇప్పటికీ ఆమె తారాస్థాయిలో అందాల ప్రదర్శన ఏమీ చేయడం లేదు కానీ స్టార్ట్‌ అయితే చేసింది. బాడీ ఫిటింగ్‌ డ్రస్సులేసి, క్లీవేజ్‌ కాస్త కనిపించే దుస్తులతో సోనాక్షి నెమ్మదిగా హీటు పెంచుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా వుంటోన్న సోనాక్షి ఈ అకౌంట్‌ ద్వారానే తన ఉద్దేశం ఏంటనేది ఇండస్ట్రీకి హింట్లు ఇస్తోంది. ఇంతవరకు సోనాక్షిని ఆ కోణంలో చూడని బాలీవుడ్‌ త్వరలోనే ఆమెనీ హాట్‌గా చూపిస్తుందేమో చూడాలి.

ఈమధ్య బరువు బాగా తగ్గిన సోనాక్షి బికినీ రెడీ బాడీ కోసం కృషి చేస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఆ ముచ్చట కూడా అభిమానులకి తీర్చేస్తుందేమో మరి. గబ్బర్‌సింగ్‌ డైలాగ్‌ మాదిరిగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అంటూ అయ్యాక ఎవరైనా బికినీ వెయ్యాలి. ఒకరు మొదటి సినిమాకి వేస్తే, ఇంకొకరు పది సినిమాలకేస్తారు. వేరేవాళ్లు ఇరవై సినిమాలకి వేస్తారు. మొత్తానికి టాప్‌లో ఉండాలంటే బికినీ వెయ్యాల్సిందే!