ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా ఈనెల 5వ తారీకున ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆయన మొదట పెద్దగా లక్షణాలు ఏమీ లేకుండానే జాయిన్ అయ్యారు. అయితే మెల్ల మెల్లగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది. దాంతో ఆయన శ్వాస తీసుకోవడంకు ఇబ్బంది పడటంతో వైధ్యులు క్రిటికల్ కండీషన్ అంటూ ప్రకటించి ఐసీయూకి తరలించి వెంటిలేటర్ సాయంతో స్వాస అందిస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
ఈ సమయంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి తనయుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా ద్వారా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు అంటూ పేర్కొన్నారు. నాన్న గారి గురించిన ఆందోళన అక్కర్లేదు అంటూ చరణ్ చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే బాలు గారు పూర్తి ఆరోగ్యంతో మళ్లీ పాటలు పాడుకుంటూ బయటకు వస్తారని ఆశిస్తున్నారు.