మహేష్‌ కోసం టీమ్‌ దిగింది

మహేష్‌ చిత్రాలకి ఇక్కడ అయితే అసలు పబ్లిసిటీనే అవసరం లేదు. మహేష్‌ సినిమా వస్తుందనే వార్త వస్తేనే థియేటర్ల వద్ద జనం క్యూ కట్టేస్తుంటారు. ఇక్కడంటే సూపర్‌స్టార్‌ కనుక ఆ ఫెసిలిటీ మహేష్‌కి వుంది కానీ, పొరుగు రాష్ట్రాల్లో అదంతా చెల్లదు కదా. స్పైడర్‌ చిత్రాన్ని తమిళంలో, హిందీలో కూడా విడుదల చేస్తోన్న మహేష్‌ అక్కడ దానికి తగినంత కవరేజ్‌ వుండేట్టు పర్సనల్‌గా జాగ్రత్త తీసుకుంటున్నాడు.

పబ్లిసిటీ అనేది నిర్మాతకి చెందిన విషయం అని వదిలేయకుండా స్పైడర్‌కి తగిన పబ్లిసిటీ లభించేట్టు ప్లాన్‌ చేసుకున్నాడు. తమిళ మీడియా నుంచి నలుగురు మహేష్‌ కోసం ప్రత్యేకంగా పని చేయబోతున్నారు. ప్రమోషన్‌ పరంగా ఈ చిత్రానికి ఎలాంటి లోటు రాకుండా, అన్ని మీడియాలో ఈ చిత్రం న్యూస్‌ కవర్‌ అయ్యేలా, పెద్ద సినిమాలకి ధీటుగా ప్రచారం లభించేలా చూసుకోబోతున్నారు.

అలాగే ఒక అయిదుగురు బాలీవుడ్‌ కవరేజ్‌ విషయంలో తోడ్పడతారు. వీళ్లకి ప్రమోషన్ల నిమిత్తం మహేష్‌ నుంచి అందిన ప్యాకేజ్‌ దిమ్మ తిరిగే లెవల్లో వుందట. దీంతో ఈ చిత్రం పబ్లిసిటీ కోసం వాళ్లు బ్లడ్‌ పెట్టడానికి సిద్ధంగా వున్నారట.