టైటానిక్ బ్రేక్ సీక్రెట్

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పడవలు చాలా ఉండొచ్చు. కానీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పడవ ప్రమాదం మాత్రం టైటానిక్ దే. ఎందుకంటే టైటానిక్ ప్రమాదంపై ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించారు. చివరకు సినిమాలో కూడా పెద్ద మంచుగడ్డను తాకి ఓడ ముక్కలైందని చూపించారు.

కానీ సినిమాలో చూపించింది, అంతా నిజమని నమ్ముతుంది తప్పంటున్నారు టైటానిక్ పరిశోధకుడు మెలనీ. టైటానిక్.. ది న్యూ ఎవిడన్స్ అనే డాక్యుమెంటరీ కొద్దిరోజుల్లో ప్రసారం కానుంది. మెలనీ వాదన ప్రకారం టైటానిక్ బాయిలర్ లో మంటలే ప్రమాదానికి కారణమట.

టైటానిక్ ఓడ దేవుడి ఘటన దైవఘటన కారణంగా ముక్కలైపోలేదని, అది క్రిమినల్ నేరమంటున్నారు మెలనీ. టైటానిక్ బాయిలర్ లో మంటలు రావడానికి కారణం దాని హాల్ బలహీనంగా ఉండటం వల్లే నట. ఆ సంగతి టైటానిక్ తయారుచేసిన కంపెనీ అధ్యక్షుడు బ్రూస్ ఇస్మేకు తెలిసినా మౌనంగా ఉన్నారట.

బెల్ ఫాస్ట్ నుంచి నౌక ప్రయాణించడానికి ముందే బలహీనంగా ఉందని, కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదంటున్నారు మెలనీ. మెలనీ వాదనను పూర్తిగా కొట్టిపారేయలేమంటున్నారు పరిశోధకులు. దీనిపై సమగ్ర విచారణ జరగాలంటున్నారు. మెలనీ చెప్పింది నిజమని తేలితే టైటానిక్ సీక్రెట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.