అఖిల్ ప్రకటన వుంటుందా?

ఈ నెలలోనే తన తరవాతి సినిమా ప్రకటన వుంటుందని హీరో అఖిల్ వెల్లడించాడు. అయితే అప్పటి నుంచి ఏ డైరక్టర్ తో అఖిల్ జోడీ కడతాడా? అన్న డిస్కషన్లు వినిపించడం ప్రారంభమైంది. కానీ ఇప్పటికిప్పుడు అఖిల్ అనౌన్స్ చేయడానికి ఏ ప్రాజెక్టు వుందా అన్నది అనుమానంగా వుంది. ఎందుకంటే పెద్ద డైరక్టర్లు ఎవ్వరూ ప్రస్తుతం ఖాళీ లేరు.

కొరటాల శివ కూడా రామ్ చరణ్ తో సినిమా చేయాలి కానీ, బోయపాటి మధ్యలో దూరారు. అందువల్ల ఆయనేమన్నా ఇటు వస్తారా? అన్నది గ్యాసిప్ గా వుంది. ఇక సుకుమార్ తో కూడా చేద్దామని అఖిల్ కు వుంది కానీ, హలో లాంటి క్లాస్ సినిమా తరువాత కాస్త ఎంటర్ టైన్మెంట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. పైగా కళ్యాణ్ కృష్ణ తో తరువాత తరువాత ఓ సినిమా ఎలాగూ వుండబోతోంది.

మరి ఇప్పుడు ఎవరు? అన్నది ఇంకా తేలలేదని తెలుస్తోంది. దాదాపు అరడజను కథలు ఇటీవలి కాలంలో అఖిల్ విన్నట్లు తెలుస్తోంది. కానీ ఏవీ ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. పైగా నాగార్జున ఇప్పుడు రిలాక్స్ మూడ్ లో వున్నారు.హలో ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడి, హాలీడే తీసుకున్నారు. ఆయన వచ్చిన తరువాత అన్నీ ఫైనల్ చేసి కానీ ప్రకటించకపోవచ్చు. అందువల్ల పదిన ఫార్మల్ గా ఏదయినా ట్వీట్ వుంటుందేమో కానీ, కాంక్రీట్ ప్రాజెక్టు ప్రకటన ఏదీ వుండకపోవచ్చు అని తెలుస్తోంది.