వనితా రెడ్డికి ‘ఆధారాలు’ ఎక్కడివి?

సినీనటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత 11రోజుల పాటు కనిపించకుండా పోయిన అతడి భార్య వనితారెడ్డి, ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయింది. చనిపోతూ తన భార్యపై విజయ్ సాయి తీవ్ర ఆరోపణలు చేశాడు. సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో సాక్ష్యం ఆధారంగా వనితకు నోటీసులిచ్చారు పోలీసులు.

ఎట్టకేలకు ఈ నోటీసులకు స్పందిస్తూ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది వనితారెడ్డి. అయితే తను కేవలం ఆధారాలు సేకరించేందుకే చాలా ప్రాంతాల్లో తిరగాల్సి వచ్చిందని, అంతే తప్ప పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మాత్రం కాదంటోంది వనితారెడ్డి.తనపై పోలీసులు నోటీసులు జారీచేసిన వెంటనే, విజయ్ సాయి ప్రైవేటు ఎఫైర్లకు సంబంధించి 2ఫొటోలు విడుదల చేసిన వనిత… ఇప్పుడు మరిన్ని ఆధారాల్ని పోలీసులకు అందించింది. వీటిలో పరాయి అమ్మాయిలతో విజయ్ సాయి శృంగారంలో పాల్గొన్న ఫొటోలతో పాటు.. మరికొన్ని ఆడియో ఫైల్స్ కూడా ఉన్నాయి.

విజయ్ సాయికు చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందని అంటోంది వనిత. సొంత ఇంట్లో తను ఉంటుండగానే వాళ్లతో విజయ్ ఉండేవాడని చెప్పుకొచ్చింది. అందుకే విజయ్ కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, తను ఎప్పుడూ విజయ్ ను టార్చర్ పెట్టలేదని అంటోంది.అయితే పోలీసులు మాత్రం వనితను అంత ఈజీగా వదిలేలా లేరు. ఎందుకంటే సెల్పీ వీడియోలో విజయ్ చాలా విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తాజాగా సమర్పించిన ఆధారాలు ఎక్కడ్నుంచి వచ్చాయో చెప్పమని వనితను ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు వనిత రెండు రకాల పాస్ పోర్టులు కలిగి ఉండడం, రకరకాల మారుపేర్లు పెట్టుకొని తిరగడం కూడా ఆమెను చిక్కుల్లో నెట్టింది.

వనితా రెడ్డి అసలు పేరు వరలక్ష్మి. ఈమె వనిత, బృందం, విన్నీ లాంటి పేర్లు కూడా మార్చుకుంది. తను ఈమధ్య కాలంలో వరుసగా కార్లు మార్చిన విషయంపై కూడా పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.