అదిరింది సెన్సారు కాలేదు

Vijay, Kajal in Adirindhi Movie Stills HD

అదిగో పాయింట్ అంటే, ఇది గ్యాసిప్ అని రాసేయడం మరీ మామూలయిపోయింది. కాస్త కనుక్కుందాం. అన్న ఆలోచన లేదు. అదిరింది సెన్సారు అయిపోయింది. ఆ డైలాగులు తీసేసారు అంటూ వార్తలు వచ్చేసాయి. రెగ్యులర్ వెబ్ సైట్ల సరే, ప్రింట్ మీడియా వెబ్ సైట్లు కూడా ఇలాగే రాసేసాయి.

కానీ అసలు విషయం ఏమిటంటే అదిరింది సెన్సారు ఇంతవరకు కాలేదు. సాధారణంగా తమిళ్ సినిమాతో పాటు డబ్బింగ్ వెర్షన్ కు సెన్సార్ అప్లయ్ చేస్తే, ఒరిజినల్ వెర్షన్ కు సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత, ఓ లుక్ వేసేసి, మిగిలిన లాంగ్వేజ్ లకు కూడా సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలాకాదు. తెలుగు వెర్షన్ అప్లికేషన్ లేటుగా వెళ్లింది. ఈలోగా ఈ జీఎస్టీ డైలాగు గడబిడ స్టార్ట్ అయింది. దాంతో తెలుగు సర్టిఫికెట్ ఆపేసారు.

లేటెస్ట్ విషయం ఏమిటంటే, తమిళ సెన్సారు జనాలు తెలుగు వెర్షన్ ను తెలుగు వచ్చిన వారితోనే చూడాలని డిసైడ్ అయ్యారట. తెలుగు వచ్చిన వారితో చూసి, అప్పుడు వారి అభ్యంతరాలు చెప్పి, ఏమవ్నా తీయాలంటే చెప్పి, అవన్నీ అయ్యాక సర్టిఫికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇదంతా జరిగే సరికి మంగళవారం వస్తుందని అంచనా.

సో, ఈవారం విడుదలలేదు. సెన్సారు కాలేదు. డైలాగులు తీయలేదు అన్నది అసలు విషయం. ఇక విడుదల అంటారా? అది సెన్సారు దయాదాక్షిణ్యం. అయితే మూడోతేదీ కావచ్చు. ఆ తరువాత కావచ్చు. ఈ దేశపు సెన్సారు వ్యవహారానికి, రెడ్ టేపిజం విధానాలకు ఇదో మచ్చుతునక మాత్రమే.