ఇప్పటివరకు చేయని పనులు చేస్తుందట

క్వీన్ సినిమా షూటింగ్ కోసం ఫ్రాన్స్ వెళ్లింది తమన్న. పారిస్ సిటీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అక్కడ అడుగుపెట్టినప్పట్నుంచి ఫ్రాన్స్ ను పొగుడుతూనే ఉంది మిల్కీబ్యూటీ. అక్కడి వాతావరణం, ప్రదేశాలు తనకు బాగా నచ్చాయంటోంది. అంతేకాదు.. ఇప్పటివరకు తను చేయని కొన్ని పనుల్ని ఈసారి పూర్తిచేస్తానంటోంది.

“ఈరోజు షూటింగ్ లేదు. మొనాకో సిటీకి వచ్చాను. కచ్చితంగా మస్తీ చేస్తా. సముద్ర తీరాన ఉన్న ఈ నగరం చాలా బాగుంది. ఈ నగరం గురించి చాలా విన్నాను. ఇప్పటివరకు చేయని కొన్ని పనుల్ని కచ్చితంగా ఈసారి చేసేస్తా.” మొనాకో సిటీకి చేరుకున్న తమన్న ఇలా తన మనసులో మాట బయటపెట్టింది.

ఫ్రాన్స్ దేశాన్ని తెగ పొగిడేస్తున్న తమన్న, చేయాలనుకుంటున్న ఆ పనులేంటో మాత్రం చెప్పలేదు. అవేంటో చెప్పమంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా నగర పర్యటనలో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.