జగన్ బురద జల్లుతాం.. నువ్వు కడుక్కో అంతే!

‘మొన్న పనామా పత్రాలు, నిన్న ప్యారడైజ్ పత్రాలు, ఇప్పుడు ఈడీ టాప్ టెన్ లిస్ట్ లో జగన్ పేరుంది.. ఇది సిగ్గుచేటు వ్యవహారం..’ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యాఖ్య. దానిపైన ‘ఈడీ టాప్ 10లో జగన్..’ అంటూ ఒక వండివార్చిన కథనం. ఇదీ కథ. మరో బురదజల్లుడు కార్యక్రమం. అనుకూల మీడియా ఏదోరాయడం, దాన్ని అల్లుకుని టీడీపీ వాళ్లు రియాక్ట్ కావడం.. ఇదంతా కొత్త ఏంకాదు కదా.. మొన్ననే ప్యారడైజ్ పేపర్ల లొల్లి అయ్యింది, ఇప్పుడు ఈడీ టాప్ టెన్ అంటూ మరోటి పట్టుకున్నారు.

ఈ కథనాన్ని కూలంకషంగా చదివితే.. ఇది ఎంత అసంబద్ధంగా ఉందో, ఎంతకామెడీగా ఉందో, జగన్ మీద బురదజల్లడమే లక్ష్యంగా దీన్ని ఎలా వండివార్చారో కాస్తంత మతి ఉన్న వాడెవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఈ జాబితాను ఈడీ విడుదల చేసింది.. అని ధైర్యంగా చెప్పలేకపోయారు. ఎందుకంటే.. ఈడీ అధికారికంగా అలాంటిదేమీ చేయలేదు. వీళ్లే రాశారు.. అలాగనీ చెప్పుకోలేరు. అందుకని ఒక ఆంగ్ల పత్రికను ఉటంకించారు. ఆ ఆంగ్లపత్రిక పేరు కూడా రాయలేదు. రాస్తే దాని టాలెంట్ ఏమిటో వీళ్ల పాఠకులకు అర్థం అయిపోతుంది కదా!

ఆంగ్ల పత్రికలు అన్నీ నిజాలే రాస్తాయి అన్నట్టుగా.. ‘ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం..’ అంటూ ఉటంకించారు. ఇక మొత్తం ముప్పై ఒక్క కంపెనీల అక్రమ సొమ్ము అన్నట్టుగా 380కోట్ల రూపాయలు అని చెప్పారు. 31 కంపెనీలు జగన్ వా? అంటేకాదు.. జగన్ సన్నిహితులవి. అంటే వాళ్లంతా బ్యాడ్జులు ఏసుకుని తిరుగుతున్నారా? జగన్ సన్నిహితులమని? వాళ్లకు మరో ఐడెంటిటీ ఏమీలేదా? జగన్ కంపెనీలతో ఏదో బీరకాయ పీచు సంబంధం ఉన్న వారందరినీ పేర్లనూ కలిపి.. వారిపై ఉన్న అభియోగాల విలువన్నంతటినీ టోల్ చేసినట్టున్నారు.

అంత కష్టపడీ 381 కోట్ల రూపాయలుగా తేల్చి.. ఆ ఫిగర్ టాప్ టెన్ లో ఉంటుందని చెప్పారు. భలే ఉంది కదా కథ. దీనికో పర్ఫెక్ట్ హెడ్డింగ్ పెట్టి ఈ రోజుకు బండి లాగించేశారు. మా పత్రికలకు విశ్వసనీయత, విలువలు, రాసే కథనంలో కాస్తంత సంబంద్ధత ఇవేవీ వద్దు.. జస్ట్ జగన్ మీద బురదజల్లితే చాలు.. అని పత్రికలను నడుపుకొంటూ ఉంటే ఇంతకన్నా ఏం ఎక్స్ పెక్ట్ చేయవద్దు. అయినా చెప్పే లక్షకోట్ల కథకు, ఈ 380 కోట్లకూ చాలాదూరం ఉందే.. భూమికీ చందమామకు ఉన్నంత దూరం.

జగన్ ను టాప్ టెన్లో నిలిపిన కథనం విలువను తిప్పి తిప్పికొట్టినా.. పట్టిసీమ ప్రాజెక్టులో కమిసన్ల విలువంత చేయదే. పట్టిసీమలో జరిగిన దోపిడీని ప్రభుత్వరంగ సంస్థ కాగ్ కడిగేసిందిగా.. దాని విలువ కూడా లేదు ఈ కథనంలో పేర్కొన్న విలువ. పీఎస్: ప్యారడైజ్ పేపర్లలో నా పేరుంది అంటున్నారుగా, నిరూపించండి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని పక్షంరోజుల కిందట జగన్ సవాల్ విసిరాడు. దానిపై టీడీపీ ఇంతవరకూ స్పందించిన దాఖలాలు ఏవీ కనిపించడంలేదు.

ఇంతలోనే ఇంకోటి అందుకున్నారు. జగన్ పాదయాత్ర జరిగినన్ని రోజులూ.. ఇలాంటివి ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయంతే!