జవాన్ మెటీరియల్ ఏదీ?

దర్శకుడు మచ్చ రవితో సమస్యగా వుందట జవాన్ టీమ్ కు. ఇదీ లేటెస్ట్ గ్యాసిప్ ఇండస్ట్రీలో. హీరోలు, నిర్మాతల మేనేజర్ కృష్ణ నిర్మాతగా బారి డబ్బులకు వెనకాడకుండా జవాన్ సినిమా నిర్మించాడు. దిల్ రాజు అండదండలు సినిమాకు వుండనే వున్నాయి. ఇక కావాల్సింది వీలయినంత బజ్. కానీ సినిమా సాంగ్స్ మెటీరియల్, ఇతరత్రా మెటీరియల్ ముందుగానే ఓ విజువల్ చానల్ దగ్గర లాక్ చేసేసారని తెలుస్తోంది.

దీంతో మీడియాకు విరివిగా పబ్లిసిటీ మెటీరియల్ కానీ, సాంగ్స్ కానీ, ఇతరత్రా వేవీ అందుబాటులోకి లేవు. పోనీ మీడియా సంగతి అలా వుంచితే మెగా ఫ్యాన్స్ తమ హీరో సాయి ధరమ్ కోసం ఏమయినా సోషల్ నెట్ వర్క్ లో హడావుడి చేద్దామన్నా మెటీరియల్ వుండడం లేదని అంటున్నారట.

ఎవర్ని అడిగినా అందంతా డైరక్టర్ మచ్చ రవి చూసుకుంటున్నారు అంటున్నారట. సినిమాకు బజ్ ఇంకా రావాలని హీరో, నిర్మాత అనుకుంటున్నారట. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా వుందట. జవాన్ యూనిట్ మొత్తం యూనిటీ గా వుండి ఎప్పుడు మరింత బజ్ తెచ్చుకుంటుందో?