నిఖిల్ సరసన ఎమ్మెల్యే

యుఆర్ మై ఎమ్మెల్యే అంటూ బన్నీ చేత పిలిపించుకుని, తెగ అందాలు ఆరబోసింది కేథరిన్ సరైనోడు సినిమాలో. ఆ తరువాత సరదాగా ఓ అయిటమ్ సాంగ్ కూడా చేసేసింది బోయపాటి కోసం. మళ్లీ కేథరిన్ ఎప్పుడు హీరోయిన్ గా కనిపిస్తుందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి వాళ్లకు ఇది గుడ్ న్యూస్ నే.

యంగ్ హీరో నిఖిల్ సరసన నటించబోతోంది కేథరిన్. తమిళ సినిమా గణితన్ ఆధారంగా తెలుగులో నిర్మించబోయే సినిమాలో కేథరిన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ సినిమాను టాగోర్ మధు నిర్మిస్తారు. గణితన్ తమిళ వెర్షన్ లో కూడా కేథరిన్ నే నటించింది. అందుకే ఆమె అయితేనే బాగుంటుందని నిర్మాతలు భావించారు.

అదే సమయంలో తన పాత్రను తెలుగు వెర్షన్ లో కూడా తనే చేస్తానని కేథరన్ ఆసక్తి కనబర్చింది. దాంతో ఆమెనే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూట్ ఫిబ్రవరి రెండోవారం తరువాత ప్రారంభమవుతుంది.